Home / Brij Bhushan Singh
దేశంలోని అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి బీజేపీ ఎంపి, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ కు ఢిల్లీలోని కోర్టు సమన్లు జారీ చేసింది. దాదాపు ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపించారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్, చట్టం పెద్ద స్థాయిలో దుర్వినియోగం అవుతోంది అని ఆరోపించారు. మేము దానిని మార్చమని ప్రభుత్వం పై వత్తిడి తెస్తామని తెలిపారు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ మంగళవారం ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రెజ్లర్లపై విరుచుకుపడ్డారు. మౌలోని మహమ్మదాబాద్‌లోని దేవ్లాస్ ఆలయంలో మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతు నిచ్చి తప్పు చేయవద్దని రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పంజాబ్ రైతులకు సూచించారు. పంజాబ్‌కు చెందిన రైతులు సోమవారం కిసాన్ యూనియన్ నాయకులు పోలీసు బారికేడ్లను ఛేదించారు.
హర్యానాకు చెందిన 90 శాతం మంది అథ్లెట్లు మరియు వారి సంరక్షకులు తమను విశ్వసిస్తున్నారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ మరియు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.