Home / Amit Shah
Union Home Minister Amit Shah: ఎన్డీఏ పాలనలో ఇండియా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ వేగంగా ముందుకెళ్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఉత్తరాఖండ్లోని రుద్రపుర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని చెప్పారు. పదేళ్లలో దేశాభివృద్దిలో 60శాతం పెరుగుదల చోటుచేసుకుందని పేర్కొన్నారు. […]
Olympics 2036: భారత్ 2036లో నిర్వహించబోయే ఒలంపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రపంచ పోలీస్- ఫైర్ క్రీడల్లో పతకాలతో సత్తా చాటిన భారత బృందాన్ని ఆయన ఘనంగా సన్మానించారు. కాగా ప్రపంచ పోలీస్, ఫైర్ క్రీడల్లో భారత్ 613 పతకాలు గెలుచుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. దేశ తరపున అద్భుత ప్రదర్శన చేసి.. దేశాన్ని గర్వపడేలా చేశారని కితాబిచ్చారు. కాగా 2036లో నిర్వహించబోయే ఒలంపిక్స్ లో […]
Amit Shah visit to Nizamabad: నక్సలైట్లు వెంటనే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఆదివారం నిజామబాద్లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో పాల్గొని మాట్లాడారు. పహల్గామ్లో ఉగ్రదాడితో పాక్ మనల్ని భయపెట్టాలని చూసిందని, తర్వాత భారత్ శక్తి ఏమిటో పాక్కు, ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం లేకుండా చేయాలన్నదే ప్రధాని […]
Union Home Minister Amit Shah to Launched National Turmeric Board: నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ మేరకు వినాయక్ నగర్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. అనంతరం పసుపు ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. అంతకుముందు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, కె.లక్ష్మణ్ తో పాటు తెలంగాణ […]
Telangana: తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. నిజామాబాద్ లో పసుపుబోర్డును ప్రారంభించేందుకు గాను ఆయన హాజరవుతున్నారు. పర్యటనలో భాగంగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి దివంగత డి.శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. డీఎస్ బతికున్నంత కాలమూ బీజేపీలో లేరు. అందునా కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో కీలక పదవుల్లో ఉన్నవ్యక్తి. కుమారుడు బీజేపీలో ఎంపీగా ఉన్నా.. కాషాయ కండువా కప్పుకోలేదు డీఎస్. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించడం వెనుక గల కారణాలపై […]
Amit Shah Tour In Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి వినాయక్ నగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభిస్తారు. […]
World Police and Fire Games: ప్రతిష్ఠాత్మకమైన 2029 ప్రపంచ పోలీసు, అగ్నిమాపక క్రీడలకు ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికైనట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా క్రీడలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశం దక్కడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. పోలీసు క్రీడల నిర్వహణకు భారత్ ప్రతిష్ఠాత్మక బిడ్ను గెలుచుకొందని అమిత్ షా తెలిపారు. కేంద్రం నిర్మించిన విస్తారమైన క్రీడా మౌలిక సదుపాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని కొనియాడారు. […]
Official Language Day: అధికార భాషా దినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. తాను ఏ భాషకు వ్యతిరేకం కాదన్నారు. కానీ మన భాషలోనే మాట్లాడితేనే బాగుంటుందని తెలిపారు. మాతృభాషను గౌరవించకపోవడం బానిసత్వమే అవుతుందని పేర్కొన్నారు. విదేశీ భాషలను గౌరవించాలని కానీ.. మాతృభాషను మర్చిపోవద్దన్నారు. “ఓ వ్యక్తి తన భాషను గౌరవించకపోతే, తన భాషలో మాట్లాడకపోతే, తన […]
Rahul Gandhi On Amit Shah : విదేశీ భాషలకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లిష్ భాషలో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు త్వరలో వస్తాయని, అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై లోక్సభలో పతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదని, విద్యార్థుల సాధికారతకు చిహ్నమన్నారు. ప్రపంచంతో పోటీ పడే ప్రతి విద్యార్థికి ఇంగ్లిష్ […]
Amit Shah Interesting Comments on English: విదేశీ భాషలకు సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లిష్లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని, అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పారు. మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని పేర్కొన్నారు. అవి మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమన్నారు. మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. […]