Home / Aam Aadmi Party
Punjab Assembly : పంజాబ్ ప్రభుత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి నిరసన సెగ తగిలింది. ఇవాళ శాసన సభ సాక్షిగా ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సర్కారు పనితీరుపై అసంతృప్తి గళం వినిపించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని విమర్శించారు. తన నియోజకవర్గంలో ప్రజలు పాకిస్థాన్‌లో ఉన్నట్టుగా ఫీలవుతున్నారని మోగా జిల్లాలోని ధరమ్‌కోట్ నియోజకవర్గ శాసన సభ్యుడు దేవిందర్ జీత్ సింగ్ వ్యాఖ్యానించారు. అప్‌గ్రేడ్ చేయడంలేదు.. మోగా జిల్లాలోని […]
ప్రభుత్వ ప్రకటనల రూపంలో రాజకీయ ప్రకటనల కోసం రూ.163.62 కోట్లు ఖర్చుపెట్టినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి గురువారం నోటీసులు అందాయి. ఈమొత్తాన్ని 10 రోజుల్లోగా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రకటనలుగా రాజకీయ ప్రకటనలను ప్రచురించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రూ.97 కోట్లను రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు బీజేపీ తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను కొనుగోలు చేసేందకు ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపించారు.
AAP : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. సాధారణంగా ఏదైనా పార్టీ 4 రాష్ట్రాల్లో 6శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కుతుంది.
ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ను ఏడోసారి బీజేపీ కైవశం చేసుకుంది. ఈ విజయం కూడ మామూలుగా లేదు.. ఏకపక్షంగా సాగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు సీరియస్ గా సిద్దంకాకపోవడం, ఆప్ ఆశించిన మేర పట్టణ ఓట్లను సాధించలేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తి కాగా... పలు ఎగ్జిట్ పోల్స్ లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందనే వెల్లడించాయి.
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతాపార్టీకి రూ.614.53 కోట్లు విరాళాలు అందాయి. మరోవైపు కాంగ్రెస్ కు రూ.95.46 కోట్లు మాత్రమే విరాళాలు రావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రూ.43 లక్షలు విరాళంగా అందుకోగా, కేరళలో సీపీఎం రూ.10.05 కోట్ల నిధులు పొందింది.
మార్చి 1 తర్వాత మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, మీ అన్నగా మీ తరపున నేను చేస్తాను. మార్చి 1 తర్వాత గుజరాత్‌కు కూడా 24 గంటల కరెంటు సరఫరా, జీరో బిల్లు వస్తుంది’ అని ఆప్ అధినేత అరవింద్ చెప్పారు.
ఆప్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు.