Home / Adilabad
RIMS Medical College: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. MBBS 2వ సంవత్సరం చదువుతున్న సాహిల్ చౌదరి అనే విద్యార్థి కళాశాల వసతి గృహంలోని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూములో ఉండే మిగతా స్నేహితులు వచ్చి సాహిల్‌ను పిలిచినా పలకకపోవడంతో.. తలుపులు పగలగొట్టి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే తోటి విద్యార్థులు అతనిని రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికేమృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం […]
New Airport Will Be Built In Adilabad: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు ఆదిలాబాద్‌లో కొత్త ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి 1600 ఎకరాలను సేకరించనున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ప్రయాణికులకు […]
Insects in food: అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు ఇచ్చే భోజనంలో పురుగులు వచ్చిన ఘటన చోటు చేసుకుంది. అంతే కాదు రోజూ నీళ్ల పప్పు పెడుతున్నారని.. అన్నం సుద్ద సుద్దగా ఉంటున్న విషయాన్ని ఓ విద్యార్థి గమనించి హాస్టల్ ఇన్చార్జిని ప్రశ్నించాడు. అయితే ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన అధికారి పట్టించుకోక పోగా సదరు ప్రశ్నించిన విద్యార్థికి టీసీ ఇస్తానని బెదిరించారు. ఇలా విద్యార్థిని బెదిరించిన హాస్టల్ […]
2 Killed in Adilabad Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూర్ మండలం బీర్సాయిపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికుల సమచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం […]
Six people died due to lightning strike : ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం ఆరుగురు అన్నదాతలను పొట్టనబెట్టుకుంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో విత్తనాలు వేసేందుకు సిద్ధమైన రైతన్నల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఏజెన్సీలోని గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో 14 మంది రైతులు వ్యవసాయ కూలీలతో కలిసి మొక్కజొన్న విత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం నుంచి రక్షణ కోసం పొలంలో ఉన్న కర్రలతో […]
kaleshwaram: జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతీ నదిలో నేటి నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. బృహస్పతిలోకి మిథున రాశిలో ప్రవేశిస్తుండటంతో సరస్వతీ నదికి పుష్కరాలు మొదలవుతాయని పండితులు తెలిపారు. కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ నిర్వహిస్తారు. పుష్కరునికి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పిస్తారు. తర్వాత […]
Poisoning Attempt in Adilabad government school drinking water: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై విష ప్రయోగం జరిగింది. ఇచ్చోడలోని ధర్మపురి ప్రభుత్వ పాఠశాల వంట రూంలోని నీటిలో పురుగుల మందు కలిపినట్లు తేలింది. దీంతో పాటు విద్యార్థులు వినియోగించే నీటిలోనూ పురుగుల మందు చల్లారు. ఇలా విష ప్రయోగం చేసిన తర్వాత ఆ పురుగుల మందు డబ్బాను అక్కడే పాడేయడం గమనార్హం. అయితే, పాఠశాల తెరిచిన తర్వాత టీచర్లు ముందే గుర్తించడంతో […]