Jr NTR: కబీర్.. నిన్ను వేంటాడి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు వెయిట్ చేస్తున్నా – హృతిక్ ట్వీట్ తారక్ రిప్లై

Jr NTR Reply to Hrithik Roshan Tweet: ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న మూవీ ‘వార్ 2’. హృతిక్ రోషన్, తారక్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 14న విడుదల కాబోతోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్ పెద్దగా బయటకు రావడం లేదు. దీంతో మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ బర్త్‌డేకు ఫ్యాన్స్ కోసం అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది ‘వార్ 2’ టీం. మే 20న వార్ 2 నుంచి టీజర్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎడిటింగ్ వర్క్ కూడా అయ్యిందని, ఎన్టీఆర్ బర్త్‌డే కోసం స్టోర్ చేసి పెట్టినట్టు హృతిక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తూ హృతిక్ చేసిన ట్వీట్‌కి తాజాగా ఆయన స్పందించారు. ‘సర్‌ప్రైజ్ కోసం తాను ఎదురుచూస్తున్నానన్నారు. “కబీర్ నిన్ను వేటాడి నీకు స్పెషల్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు వెయిట్ చేయలేకున్నా’ అంటూ హృతిక్ ట్వీట్‌కి స్పందించారు ఎన్టీఆర్.
Thank you in advance @iHrithik sir!!!
Can’t wait to hunt you down to give you a special return gift Kabir… #War2 https://t.co/cLVtgTtgQd
— Jr NTR (@tarak9999) May 16, 2025