Home / టెక్నాలజీ
టెన్నిస్‌స్టార్ సానియా మీర్జా మహ్మద్ షమీని పెళ్లి చేసుకోబోతున్నారా? అయితే వీరిద్దరు ఇండియాకు చెందిన సక్సెస్‌పుల్ క్రీడాకారులు. గత దశాబ్ద కాలం నుంచి చూస్తే వీరిద్దరు వారి వారి రంగాల్లో విజేతలుగా నిలిచారు.
ప్రస్తుతం మొబైల్ ఫోన్ మన జీవితంలో ఓ భాగం అయిపోయింది. కేవలం మాట్లాడుకోవడానికే కాకుండా ఒక విధంగా చెప్పాలంటే బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తోంది. కొనుగోళ్ల నుంచి చెల్లింపుల వరకు అంతా మొబైల్ఫోన్ల ద్వారానే. అలానే కంపెనీలు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడి సరికొత్త ఫీచర్లతోకస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటాయి.
టెస్లా యొక్క గిగా టెక్సాస్ కర్మాగారంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై ఒక రోబో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రెండేళ్ల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజనీర్ కొత్తగా వేసిన అల్యూమినియం ముక్కల నుండి కారు భాగాలను కత్తిరించే పనిలో ఉన్న రోబోలను పర్యవేక్షించడానికి సాఫ్ట్‌వేర్‌ను కోడింగ్ చేస్తున్నాడు.
ప్రధాని నరేంద్ర మోదీ తన యూట్యూబ్ ఛానెల్‌కు 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లను కలిగివున్న తొలి ప్రపంచ నేతగా నిలిచారు. ప్రధానమంత్రి యూట్యూబ్ ఛానెల్‌కు మొత్తం 20 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు, అందులో 23,000 వీడియోలు అప్లోడ్ చేయబడ్డాయి.
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఉద్యోగుల ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నందున బహుళ విభాగాలలో కనీసం 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. పేటీఎం అక్టోబర్‌లో తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది.ఇంజనీరింగ్ మరియు సేల్స్ టీమ్ నుండి ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యాపిల్ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని హెచ్చరించింది. ఇది దాడి చేసేవారు సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుందని చెప్పింది.
వాట్సాప్, మైక్రోసాఫ్ట్ స్టోర్‌లోని అధికారిక బీటా ఛానెల్ ద్వారా తన విండోస్ స్థానిక యాప్ కోసం కొత్త అప్డేట్ను విడుదల చేస్తోంది. ఈ అప్డేట్లో తెలియని ఫోన్ నంబర్లతో చాట్లను ప్రారంభించడాన్ని సులభతరం చేసే ఒక ప్రముఖ ఫీచర్ ఉంది. దీనితో యూజర్లు తెలియని వారితో వారి ఫోన్ నెంబర్ తో చాటింగ్ చేయవచ్చు.
డైసన్ జోన్ మరోసారి ఆవిష్కరణలో ముందంజలోకి వచ్చింది. ఈసారి డైసన్ జోన్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్లను విడుదల చేస్తూ, భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఐదేళ్ల పాటు నిరంతర పరిశోధన మరియు అభివృద్ధితో రూపొందించిన ఈ హెడ్ఫోన్లు సాటిలేని శ్రవణ అనుభవాన్ని అందిస్తాయి. ప్రధాన ఫీచర్లలో 50 గంటల వరకు నిరంతర
భారత ప్రధాని నరేంద్ర మోదీ వాట్సాప్ చానల్ వారంలోపే 5 మిలియన్ల మంది ఫాలోవర్ల మైలురాయిని అధిగమించింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసారు. తన ఫాలోవర్లందరికీ కృతజ్జతలు తెలిపారు.
అమెరికాలోని నార్త్ కరోలినాలో గూగుల్ మ్యాప్స్ సూచనలను అనుసరిస్తూ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన జరిగింది. దీనితో అతని కుటుంబం ఇప్పుడు గూగుల్‌పై దావా వేసింది.ఫిలిప్ అనే వైద్య పరికరాల విక్రయదారుడు తన కుమార్తె తొమ్మిదవ పుట్టినరోజు వేడుక నుండి ఇంటికి వెళుతుండగా ఈ విషాద ఘటన జరిగింది.