Home / ప్రాంతీయం
Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ కానున్నారు. ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, కేబినెట్ విస్తరణపై చర్చ జరగనున్నట్టు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని […]
Amaravati : ఏపీలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఇవాళ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ (జీఎన్‌యూ)తో కూటమి ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో జీఎన్‌యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం అమరావతిలో అంతర్జాతీయ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్‌యూ రూ.1,300 కోట్లు పెట్టుబడి […]
Chandrababu : ధనవంతులు, పేదలను ఒకేచోటకు చేర్చడమే లక్ష్యంగా పీ-4 విధానాన్ని రూపొందించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇందులో భాగస్వామ్యం కావడానికి ఎన్నారైలతోపాటు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావొచ్చని పేర్కొన్నారు. ఈ విధానం అమలులో అండగా నిలిచేవారిని మార్గదర్శిగా, లబ్ధిపొందే కుటుంబాలను బంగారు కుటుంబాలుగా వ్యవహరిస్తామన్నారు. పీ-4 విధానంపై ఇవాళ సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ విధానం అమలు తీరుపై చంద్రబాబు స్పష్టతనిచ్చారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు […]
Tirumala : టీటీడీ శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకోసారి సుపథం దర్శనం కల్పిస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సుపథం టికెట్ ఇచ్చి స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామని స్పష్టం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో శ్యామలరావుతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. బోర్డు తీర్మానాలను ఆయన వివరించారు. బోర్డు చేసిన తీర్మానాలు.. 1. ఇతర దేశాల్లో ఆలయాల […]
Group-1 Candidates : గ్రూప్-1 అభ్యర్థులు ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని పిటిషన్ వేశారు. గ్రూప్-1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 18 రకాల సబ్జక్టులు ఉంటే, 12 సబ్జక్టుల నిపుణులతోనే దిద్దించారని పేర్కొన్నారు. మూడు భాషల్లో పరీక్ష జరిగినా మంచి నిపుణులతో దిద్దించలేదని వెల్లడించారు. ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో రెండు భాషల (తెలుగు, ఇంగ్లిష్) పేపర్లు దిద్దించచారని, దీంతో మూల్యాంకణంలో నాణ్యత […]
Araku Coffee Stalls : ఏపీలోని అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో ఇవాళ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్పీకర్ ఆదేశాలతో రెండు స్టాళ్ల ఏర్పాటుకు లోకసభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంగం 1, 2 కోర్టు యార్డు వద్ద స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 28 వరకు స్టాళ్ల […]
Heavy Rain: హైదరాబాద్‌లో ఇవాళ పలు చోట్ల వర్షం కురిసింది. వాతావరణంలో మార్పుల వల్ల హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బోరబండ, మాదాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, జూబ్లిహిల్స్, సుల్తాన్ పూర్, మల్లంపేట్, గండి మైసమ్మ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపుతున్నారు. దీంతో నగరవాసులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఉక్కపోత, […]
KCR : బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి సహా సభ్యులు సవాల్ విసిరారు. శాసన సభకు వచ్చి పతిపక్ష నేతగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని సభ్యులు మాట్లాడారు. అయినా కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన ఇప్పటి వరకూ రాలేదు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి […]
MLC election : రాష్ట్రంలో మరో ఎన్నిక నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఎలక్షన్ సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 1 మే 2025న పదవి పూర్తి కాబోతున్న ఎంఎస్ ప్రభాకర్‌రావు స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నిక జరగబోతున్నది. ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ 23న ఎన్నిక నిర్వహించనున్నారు. 25న ఫలితాలు లెక్కించనున్నట్లు ఈసీ పేర్కొంది. హైదరాబాద్ జిల్లాల్లో వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు […]
TANA : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్లకోసారి మహాసభలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 3వ తేదీ నుంచి 5వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవిలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తానా 24వ కాన్ఫరెన్స్‌కు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని తానా ప్రతినిధులు ఆహ్వానించారు. ఇవాళ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో […]