Home / బ్రేకింగ్ న్యూస్
ఒడిశాలోని బాలాసోర్లో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ప్రమాదం సందర్బంగా రైలులోని పలు బోగీలు బోల్తా పడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం బృందాలు బయలుదేరాయి.
సీఆర్డీఏ పరిధిలో సీఎం జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద 'నవరత్నాలు—పేదలందరికీ ఇళ్లు' పథకం కింద ఈ పట్టాలు పంపిణీ జరుగుతుంది. ఇందులో భాగంగా 1402 ఎకరాలలో , 25 లేఅవుట్స్ గా విభజించి.. దాన్ని మొత్తాన్ని ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి 50,793 ప్లాట్లను సిద్ధం చేశారు.
MiG 21: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానం ప్రమాదవశాత్తు ఓ ఇంటిపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
కేసీఆర్ ప్రభుత్వంపై సీనియర్ నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గత కొంతకాలంగా వ్యతిరేకతతో ఉన్నారు. పలు సందర్బాల్లో బహిరంగంగానే వీరుద్దరూ కేసీఆర్ పై విరుచుకుపడినా అధిష్టానం ఏ యాక్షన్ తీసుకోలేదు.
Amritpal Singh: ఖలిస్తానీ నాయకుడు.. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మర వేట సాగిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు చేపట్టిన వేట ఐదో రోజుకు చేరుకుంది.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ లో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇది వరకే ఈ నెల 11న కవిత తొలి విచారణకు హాజరైన సందర్భంలో కూడా ఇలాంటి వాతావరణం లేదు.
జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల నుంచి సభ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పుడు అభిమాన సముద్రం మధ్య విజయవాడ నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ మచిలీపట్నం బయలు దేరారు. అంతకుముందు బెంజ్ సర్కిల్ మీదుగా ఆటోనగర్ వారాహి వద్దకు పవన్, నాదెండ్ల మనోహర్ చేరుకునున్నారు.
GDS Results: దేశవ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల్లో 40,889 ఉద్యోగాలకు జనవరిలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి మొదటి జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది.
ఎన్నికల కమిషన్ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు గట్టి షాక్ ఇచ్చింది. ఏక్నాథ్ షిండే వర్గానికే అధికారిక శివసేన పేరుతో పాటు పార్టీ చిహ్నం దక్కుతుందని తేల్చి చెప్పింది
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, సీనియర్ రాజకేయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంక్రాంతి వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు ప్రకటించారు.