Home / జాతీయం
Iran-Israel War: ఇజ్రాయెల్-ఇరాన్ రెండుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించారు. యుద్ధంపై భారత్ మౌనం వహించడాన్నితప్పుబట్టారు. ఈ విషయంలో కేంద్రం మౌనం దౌత్య వైఫల్యంలా కన్పిస్తోందని విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి దేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయం నుంచి దూరంగా జరిగినట్లుగా కనిపిస్తోందన్నారు. టెహ్రాన్‌పై, టెల్ అవీవ్ చేస్తున్న దాడులు చట్టవిరుద్ధమని, ఈ సందర్భంగా సార్వభౌమాధికార ఉల్లంఘనగా ఆమె అభివర్ణించారు. ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులతో ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు […]
International Yoga Day 2025: యోగా శారీరక వ్యాయామమే కాదు.. ఒక జీవన విధానం. యోగాతో కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతో పాటు ఆచరించాల్సిన ఆవశ్యకత ఉంది. యోగాను నిత్యం సాధన చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాగా, ఇటీవల కాలంలో యోగాపై ప్రజల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఎక్కువ మంది యోగాను చేస్తున్నారు. అయితే […]
President Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేదికపై భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు. ముర్ము 67వ పుట్టినరోజు సందర్భంగా డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అంధ విద్యార్థులు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు గీతాలు ఆలపించారు. ఈ క్రమంలో ముర్ము భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లో మూడురోజుల పర్యటనకు వెళ్లిన ఆమె డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీని […]
Students from Iran to India : ఇజ్రాయెల్-ఇరాన్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ఇటీవల తన గగనతలాన్ని మూసివేసింది. కాగా, భారత్ కోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇరాన్లో చిక్కుకుపోయిన దాదాపు వెయ్యి మంది భారతీయులు కొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. ‘ఆపరేషన్ సింధు’లో భాగంగా ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి రానున్నారు. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్‌లోని పలు నగరాల నుంచి […]
Prime Minister Modi visit Bihar : బిహార్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రధాని శుక్రవారం బిహార్‌లో మరోసారి పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై నిప్పులు చెరిగారు. బిహార్‌ను ‘లైసెన్స్ రాజ్’ సుదీర్ఘ కాలం పేదరికంలో ఉంచిందని దుయ్యబట్టారు. ఇందులో దళితులే అతిపెద్ద బాధితులుగా మారారని ఆరోపించారు. బిహార్‌లోని సివాన్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. ఎన్డీయే హయాంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు. బిహార్‌ను ఎన్డీయే అభివృద్ధి […]
Rahul Gandhi On Amit Shah : విదేశీ భాషలకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లిష్ భాషలో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు త్వరలో వస్తాయని, అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై లోక్‌సభలో పతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదని, విద్యార్థుల సాధికారతకు చిహ్నమన్నారు. ప్రపంచంతో పోటీ పడే ప్రతి విద్యార్థికి ఇంగ్లిష్ […]
Air India Cancelled Some Flights: దేశవ్యాప్తంగా ఎయిరిండియా విమానాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. వారం క్రితం అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరువక ముందే ఇలాంటి సమస్యలు బయటపడటంతో ఎయిర్ ఇండియా సతమతమవుతోంది. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారం దిశగా సంస్థ అడుగులు వేస్తోంది. దీంతో ఎయిర్ ఇండియా విమానాల్లో రక్షణ తనిఖీలు చేపడుతోంది. రెండు రోజుల క్రితం డీజీసీఏ ఎయిర్ ఇండియా విమానాలను తనిఖీ చేసింది. అందులో కొన్ని విమానాల్లో లోపాలు ఉన్నాయని నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే […]
PM Modi Says Birthday Wishes To President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, నేతలు, అధికారులు రాష్ట్రపతికి బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు. “వారి జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుంటాయి. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల […]
Two Maoists Killed In Encounter: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలోని చోటేబేటియా పోలీస్ట్ సేషన్ పరిధిలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మావోలు మృతిచెందారు. ఇందులో ఒక మహిళా మావోయిస్టు ఉన్నారు. కాగా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నారన్న సమాచారంతో డీఆర్జీ, బీఎస్ఎఫ్ పోలీసులు కాంకేర్ జిల్లాలోని అడువుల్లో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో అమతోలా- కల్పార్ గ్రామాల సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో […]
Nine peoples killed in accident: వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పురులియా జిల్లాలో నేషనల్ హైవే 18 మీద బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లారీని బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతులు పురులియా జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నామ్షోల్ ప్రాంతంలో ఘటన జరిగింది. అదాబనా గ్రామం నుంచి జార్ఖండ్ లోని తిలాయితాండ్ […]