Home / Africa
బుర్కినా ఫాసోలో మిలిటరీ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు గ్రామాల్లో సుమారు 223 మందని దారుణంగా చంపారని మానవ హక్కు గ్రూపు తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. ఈ సామూహిక హత్యలు ఫిబ్రవరి 25 నోన్‌డిన్, సోరో గ్రామాల్లో జరిగాయని గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
ఆఫ్రికాలోని చమురు సంపన్న ప్రాంతమైన అబేయిలోని గ్రామస్థులపై ముష్కరులు దాడి చేశారు.ఈ దాడిలో యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షకుడితో సహా 52 మంది మరణించగా 64 మంది గాయపడ్డారని ప్రాంతీయ అధికారి తెలిపారు.
Africa: ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు నరమేధం సృష్టించారు. ఈ నరమేధంలో 50 మందిని ఊచకోత కోశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.
ఈక్వటోరియల్ గినియాలో మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందడంతో ఏడుగురు మరణించారు. మరో 20 మరణాలు రక్తస్రావ జ్వరం కారణంగా జరిగి ఉంటాయని అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.టాంజానియాలోని వాయువ్య కాగేరా ప్రాంతంలో అధికారులు ఈ వారం ప్రారంభంలో ఐదుగురు మరణించగా మరో ముగ్గురు మార్బర్గ్ వైరస్ బారిన పడ్డారు,
ఆఫ్రికాలోని స్థానిక ఆహార పంటల్లో కరువు నిరోధకతను మెరుగుపరిచే జన్యువులను పరిశోధకులు గుర్తించారు. హైబ్రిడైజేషన్ ద్వారా ఈ జన్యువులను చేర్చడం వల్ల పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు మరియు హీట్‌వేవ్‌ల వల్ల ప్రభావితమయ్యే పంట దిగుబడి మెరుగుపడుతుంది.
మానవాళి పై ప్రాణాంతక వైరస్లు దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ. ఆఫ్రికాలో మరో ప్రమాదకర వైరస్ బయటపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది.