Home / AP CM Chandrababu
AP CM Chandrababu : ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్య్రోద్యమ వీరుడిగా దేశానికి ఆ మహానుభావుడు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆ మేరకు ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని, అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. […]
Vontimitta : కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్టకు చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. విజయవాడ నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట చేరుకున్నారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేదపండితులు స్వామి వారి ప్రసాదం చంద్రబాబు దంపతులకు అందజేశారు. చంద్రబాబు దంపతులకు వేదపండితుల ఆశీర్వాదం.. అనంతరం ముఖ్యమంత్రి […]
AP CM Chandrababu : త్వరలో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. బీసీలకు 55 కార్పొరేషన్లు పెట్టామన్నారు. బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకువచ్చామని తెలిపారు. అన్నివర్గాల కంటే మిన్నగా బీసీవర్గాలను ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం ఉద్ఘాటించారు. శుక్రవారం ఏలూరు జిల్లాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. విదేశాల్లో చదువుకోవాలనే వారికి ఒక్కొక్కరికి రూ.15 […]
AP CM Chandrababu Review Meet on State Income: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి నమోదైనట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆదాయార్జన శాఖలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సొంత ఆదాయ వనరులు పెరిగితేనే నిజమైన వృద్ధి చెందుతుందన్నారు. అయితే,పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టాలని అధికారులకు సూచనలు చేశారు. కాగా, రాష్ట్ర ఆదాయం రూ.1.37 లక్షల కోట్ల లక్ష్యం ఉండగా.. […]
AP CM Chandrababu : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అగ్రరాజ్యం అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగానికి అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి రైతన్నలను ఆదుకోవాలని కోరారు. ఏపీ రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలకమైన భూమిక పోషిస్తోందని, ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలువాలని సీఎం లేఖలో పేర్కొన్నారు. […]
AP CM Chandrababu: జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో కూటమి సర్కారు పనిచేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో సీఎం పర్యటించారు. జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో ఆయన మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి నూతన ఆలోచనలు.. ఏపీ అభివృద్ధికి ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలను […]
Nominated Posts : ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల కేటాయింపు పరంపర కొనసాగుతోంది. ఇందులో భాగంగా 38 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల పేర్లను తాజాగా సర్కారు ప్రకటించింది. ఏఎంసీ చైర్మన్ పదవుల్లో 31 టీడీపీ, ఆరు జనసేన, ఒకటి బీజేపీ నేతలకు కేటాయించింది సర్కారు. చైర్మన్ల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటిస్తామని కూటమి సర్కారు స్పష్టం చేసింది. అందుకోసం కసరత్తు జరుగుతోందని పేర్కొంది. 2024లో ఎన్నికల్లో […]
AP Cabinet : ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను డీమెర్జ్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీడీసీ (ఏపీ డ్రోన్ కార్పొరేషన్)ను ఏపీఎస్ఎఫ్ఎల్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్) నుంచి సపరేట్ చేసి, స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో డ్రోన్ సంబంధిత అంశాలను నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. నేడు వెలగపూడిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. భేటీలో 23 అంశాలపై చర్చించారు. […]
P4 Chandrababu : సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది పండుగ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందని, అందుకే వినూత్న కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘పీ-4’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్‌గా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. […]
Chandrababu : ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ కార్యాలయానికీ వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదేనన్నారు. ఇవాళ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. 20 ఏళ్ల కింద ఐటీ ప్రాధాన్యత గురించి తాను చెప్పానన్నారు. తన మాట […]