Home / ప్రాంతీయం
Miss World Competition To Be Held In Hyderabad: మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు షెడ్యూల్ విడుదల చేశారు. పోటీలు మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ముగింపు వేడుకలు కూడా హైదరాబాద్‌లో జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీలకు 120 […]
High court Big shock to Former MLA Vallabhaneni Vamsi: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. కాగా, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని వల్లభనేని వంశీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు ఆయన దాఖలు […]
Medigadda complainant murdered in Bhupalapalli: తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. భూపాలపల్లి రెడ్డి కాలనీలో ఆయనపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. వెంటనే తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందారు. పాలపల్లిలో కత్తులు, గొడ్డళ్లతో దుండగులు నరికి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. హంతకులను పట్టుకునేంత వరకు అంత్యక్రియలు […]
Telangana Former CM KCR Hospitalized: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఏఐజీ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సాధారణ పరీక్షల కోసం మాత్రమే వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ తిరిగి ఇంటికి చేరుకుంటారని చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
AP CM Chandrababu Letter To Central Govt for Mirchi Famers: ఏపీలో మిర్చి రైతుల దుస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మిర్చి ధరలు విపరీతంగా పడిపోవటంతో కుదలైన మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ బుధవారం ఆయన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. మిర్చి రైతుల పరిస్థితి, మార్కెట్లో ధరల పతనంపై ఈ నెల 14న ఢిల్లీలో జరిగిన సమావేశం వివరాలను లేఖలో పేర్కొన్నారు. […]
KCR High Level Meeting at Telangana Bhavan: తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రేణుల ఘన స్వాగతం సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన తమ అధినేతను చూసేందుకు నగరం నలుమూలల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. […]
VIJAYA Offers 10% Discount on Vijayawada Route: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. విజయవాడ రూట్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులు ఈ మార్గాల్లో దాదాపు 8 నుంచి 10శాతం వరకు చార్జీల్లో రాయితీ పొందవచ్చు. ఈ రాయితీలో భాగంగా లహరి నాన్ ఎసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 […]
KCR Visits Passport Office for Renewal: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్‌లో ఉన్న పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చారు. ఈ మేరకు ఆయన పాస్‌పోర్టు కార్యాలయంలో తన పాస్‌పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు. కాగా, డిప్లమాటిక్ పాస్‌పోర్టు స్థానంలో సాధారణ పాస్‌పోర్టుల తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి తన కాన్వాయ్‌లో కేసీఆర్ పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చారు. ఈ మేరకు తన పనిని పూర్తి చేసుకొని నేరుగా తెలంగాణ […]
Maha Shivaratri Brahmotsavam Begins in Srisailam: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం కలగలిసి ఉన్న మహా క్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రంలో ఓకే ప్రాంగణంలో శక్తిపీఠం, జ్యోతిర్లింగం రెండు కలగలసి ఉన్నాయి. ఈ ఆలయంలో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈనెల 23వ […]
YS Jagan Guntur Tour To Support Mirchi Farmers: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు బయలుదేరారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డుకు వాహనంలో బయలుదేరారు. మిర్చి యార్డులో రైతులను పరామర్శించేందుకు ఆయన వెళ్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున జగన్ టూరుకు అనుమతి లేదని మిర్చి యార్డు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, మిర్చి యార్డులో రాజకీయ సమావేశాలు నిషేధం అంటూ మైక్‌లో […]