Home / అంతర్జాతీయం
Nobel Peace Prize 2024 Awarded to Japan: ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించారు. 2024 ఏడాదికి గానూ జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు వరించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఈ మేరకు స్టాక్ఘోంలో ఉన్న కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ కమిటీ ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 111మంది సభ్యులు, 31 సంస్థలను నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ ఏడాది […]
Donations flood Kamala Harris’ campaign: అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తుండగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ కమలాహారిస్ బరిలో నిల్చున్నారు. ఈ ఏడాది జూలైలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహారిస్ తెరపైకి రాగా.. అప్పటినుంచి ఆమెకు మద్దతు పెరుగుతూ వస్తోంది. కమలాహారిస్ అభ్యర్థిత్వం ప్రకటించినప్పటినుంచి ఆమె ప్రచారానికి 1 బిలియన్ డాలర్లకుపైగా విరాళాలు సేకరించారు. ప్రస్తుతం అమెరికా వర్గాల్లో […]
Israeli airstrikes on Gaza mosque kill 26, injure 93: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున సెంట్రల్ గాజాలోని ఓ మసీదులో దాడి చేసింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. 93 మందికి తీవ్ర గాయాలైనట్లు హమాస్ తెలిపింది. డెయిర్ అల్-బలాహ్ పట్టణంలో ఉన్న ఓ మసీదులో శరణార్థులు తల దాచుకున్నారు. ఈ మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో మరణించిన వారంతా పురుషులేనని వెల్లడించింది. అయితే […]
Israel’s Attacks Against Hezbollah in Lebanon Expand: ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక నేత సయీద్ అతల్లా మృతి చెందాడు. ఈ ఘటనలో సయీద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా చనిపోయినట్లు సమాచారం. ఉత్తర లెబనాన్‌లోని ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ఇజ్రాయెల్ చేసిన దాడిలో హమాస్‌కు చెందిన ముఖ్య నేత సయీద్‌తో పాటు మరో ముగ్గురు […]
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సుమారుగా 60 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. నిరాశ్రయులకు షెల్టర్ జోన్ గా ఉన్న పాఠశాల, మరొక ప్రాంతంపై ఈ దాడులు జరిగాయి. కాగా, దాదాపు 10 నెలలుగా కొనసాగుతున్న వివాదంలో కాల్పుల విరమణ చర్చలు మరోసారి నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
: ఒమన్‌లోని ఇమామ్ అలీ మసీదు సమీపంలో జరిగిన కాల్పుల్లో ఒక భారతీయుడుతో సహా ఆరుగురు మరణించగా 28 మంది గాయపడ్డారు. జూలై 15న మస్కట్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడని, మరొకరు గాయపడ్డారని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
16 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న చమురు నౌక ఒమన్ సముద్రంలో బోల్తా పడిందని మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ మంగళవారం తెలిపింది. ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే పేరు ఈ నౌకలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని ఒమానీ కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం భారీ వర్షం కారణంగా కనీసం 35 మంది మరణించగా 230 మంది గాయపడినట్లు సమాచార మరియు సంస్కృతి విభాగం అధిపతి ఖురైషి బాడ్‌లూన్ తెలిపారు. భారీ తుఫానులు మరియు వర్షాల కారణంగా చెట్లు, గోడలు మరియు ప్రజల ఇళ్ల పైకప్పులు కూలిపోయాయని బడ్లూన్ చెప్పారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే, చైనీస్ రిటైలర్లు మరియు ఆన్లైన్ దుకాణాలు ట్రంప్ ఫోటోలతో కూడిన టీ-షర్టుల అమ్మకాలను ప్రారంభించాయి.
సెంట్రల్ గాజాలోని నుసిరత్ క్యాంప్‌లో శరణార్దుల శిబిరంగా నిర్వహించబడుతున్న పాఠశాలపై ఇజ్రాయెల్ మిలటరీ చేసిన దాడుల్లో 15 మంది మరణించినట్లు గాజా లోని సివిల్ డిఫెన్స్ ఏజన్సీ తెలిపింది.