Home / Ambati Rambabu
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యల దృష్ట్యా ఆయనకు వచ్చే నెల 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఈ క్రమంలోనే తెదేపా శ్రేణులు, నేతలు హర్షం వ్యక్తం చేస్తూ పండుగ చేసుకుంటున్నారు.
ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి అంబటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అక్కడికి కర్రలతో వెళ్లారు. అక్కడ అంబటి రాంబాబుతో టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో టీడీపీ నేత కేతినేని హరీష్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజం గెలిచింది కనుకే.. చంద్రబాబు జైల్లో ఉన్నారు. నిజం గెలవాలని ఉద్యమం చేస్తే.. చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర పై స్పందించారు.
వారాహి విజయ యాత్ర అనేది అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఉన్నది జనసైనికులు కాదని.. సైకిల్ సైనికులని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నిజంగా నిజాయితీ పరుడు అయితే.. అవినీతి పరుడైన చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేశారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. కాగా సభ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అసెంబ్లీలో రచ్చ మొదలయ్యింది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా టీడీపీ డిమాండ్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని.. బీఏసీలో దీనిపై చర్చించి నిర్ణయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. నిన్న గ్రాండ్ గా రిలీజయింది. తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సితం సినిమాకు బ్రో రీమేక్‌గా వచ్చింది.
సైకిల్‌ను చంద్రబాబు, లోకేష్‌లు తొక్కలేకపోతున్నారని.. దానికి తుప్పు పట్టిందని రాంబాబు సెటైర్లు వేశారు. ఈ మేరకు తాజాగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తెదేపా అధినేత చంద్రబాబు ఒక ముసలి సైకో అని.. అధికారం లేకపోతే ఆయన బతకలేడని వైకాపా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై నెక్స్ట్ లెవెల్ లో ఫైర్ అయ్యారు అంబటి. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో
రాష్ట్రంలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో కుమారుడ్ని పోగొట్టుకుని పరిహారంగా వచ్చిన డబ్బులో వాటా ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు తమను బెదిరించారని గంగమ్మ అనే మహిళ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈరోజు పాదయాత్రను ప్రారంభించిన టీడీపీ నేత నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ ను ఉద్దేశస్తూ... 'ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు' అని ఎద్దేవా చేశారు.