Home / Ambati Rayudu
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని కలిసిన తరువాత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తమ భేటీపై స్పష్టతనిస్తూ ట్వీట్ చేశారు. ఎపి ప్రజలకి సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చి వైసిపిలో చేరానని అంబటి రాయుడు తెలిపారు. తన ఆశలు, ఆశయాలు ఫలిస్తాయని అనుకున్నానని అంబటి రాయుడు చెప్పారు.
ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మంగళగిరి జననసేన పార్టీ ఆఫీస్‌కి వెళ్ళారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయని జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్‌ని అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారా లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అధికార వైసీపీకి షాకిచ్చారు. 2023 డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన అంబటి రాయుడు పది రోజులు కూడా తిరగకముందే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ మేరకు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. తాను అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు అంబటి తిరుపతి రాయుడు వైఎస్ఆర్సిపిలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ క్రికెటర్ రాయుడికి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి రాయుడు గత కొద్దకాలంగా ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పధకాలకు తన మద్దతు తెలుపుతూ వస్తున్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాసేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాయుడు ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్ 2023 ట్రోఫీని సీఎంకు చూపించారు. సీఎం జగన్ అంబటిని, అతను ప్రాతినిధ్యం వహించిన చెన్నై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తన కెరీర్లో చివరిదని అంబటి వెల్లడించాడు.