Home / Air India flight
: ఇక నుండి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీస్ లు నడపనున్నారు .ఆంధ్ర ప్రాంతం నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ప్రతి రోజు చాలా మంది వ్యాపార నిమిత్తం ,ఇతర కార్యక్రమాలకు వెళ్తూ వుంటారు .
న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ఈ - మెయిల్ రావడంతో పెద్ద కలకలం ఏర్పడింది. విమానంలోని లావెట్రీలో ఓ టిష్యూ పేపరుపై విమానంలో బాంబు పెట్టినట్లు రాసి ఉన్న పేపర్ లభించింది.
ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానానికి ఊహించని అంతరాయం ఏర్పడటంతో ముగ్గురు బీజేపీ ఎంపీలతో సహా 100 మంది ప్రయాణికులు ఆదివారం (జూలై 23) గుజరాత్లోని రాజ్కోట్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.
ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో ఎయిరిండియా విమానం ఇంజిన్లో లోపం కారణంగా రష్యాలోని మగదాన్కు దారి మళ్లించారు. ఎయిర్ ఇండియా అధికారి తెలిపిన వివరాల ప్రకారం విమానం రష్యాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారని ఒక అధికారి తెలిపారు.
ఒక ప్రయాణీకుడి అనుచిత ప్రవర్తన కారణంగా ఢిల్లీ-లండన్ ఎయిరిండియా విమానం సోమవారం ప్రయాణించిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఈ ఘటనపై ఎయిర్లైన్స్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు. ఎయిరిండియా విమానం ఉదయం 6.35 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరింది.
ఎయిర్ ఇండియా లండన్-ముంబై విమానంలో బాత్రూమ్లో ధూమపానం చేయడం మరియు ఇతర ప్రయాణీకులతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై అమెరికా పౌరుడిపై కేసు నమోదయింది.
168 మంది ప్రయాణికులతో కాలికట్ నుండి సౌదీ అరేబియాలోని దమ్మామ్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం (IX385) శుక్రవారం తిరువనంతపురం వైపు మళ్లించబడింది.
ఎయిర్ ఇండియాకు చెందిన నెవార్క్ (యుఎస్)-ఢిల్లీ ఫ్లైట్ (AI106) మూడు వందల మంది ప్రయాణికులతో బుధవారం నాడు స్వీడన్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలంటుకోవడంతో విమానం నుంచి ప్రయాణికులను కిందికి దించేశారు. మస్కట్ నుంచి కోచికి బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ సందర్భంగా ఇంజిన్లో మంటలు చెలరేగాయి.