Home / సినిమా
మంచు మోహన్ బాబు కుమారులైన విష్ణు, మనోజ్ మధ్య వివాదం రోడ్డున పడింది. గత కొన్నాళ్లుగా విష్ణు, మనోజ్ మధ్య మనస్పర్దలు ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్న క్రమంలో ఈరోజు తాజాగా మంచు మనోజ్ పెట్టిన స్టేటస్ ఈ వార్తలను మరింత బలాన్ని చేకూర్చింది. ఇంత కాలం నాలుగు గోడలు మధ్య ఉన్న ఈ వివాదం ఇప్పుడు బయటకు వచ్చింది. నా వాళ్లపై విష్ణు దాడి చేస్తున్నాడంటూ మనోజ్ పేర్కొన్నారు.
మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం ఇన్నాళ్ళకు బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా స్టోరీ పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వివాదం బయటపడింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను, బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టాడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చిత్ర పరిశ్రమను వరుస విషాదలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని వీడి శోకాన్ని మిగిల్చారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ప్రదీప్ సర్కార్ మరణించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 68 సంవత్సరాలు. కాగా ఆయన ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రదీప్ మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది.
టాలీవుడ్ లోకి “పెళ్లి చూపులు” అనే చిత్రంతో హీరోగా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి…”అర్జున్ రెడ్డి” సినిమాతో యువతలో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రౌడి హీరో కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుంది. మనోడికి కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు
ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఏ ఏయంగ్ బ్యూటీ కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది. తాజాగా కృతి శెట్టి చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో కాక రేపుతోంది.
నాని కీర్తిసురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా మార్చ్ 30న దసరా సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ వేగం పెంచింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని కీర్తి సురేష్ రానా ముంబైలో సందడి చేశారు.
Shaakuntalam Jewellery: నటి సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియా లెవల్ లో తెరకిక్కిన ఈ మైథాలాజికల్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా వేసవి కానుకగా ఏప్రిల్ 14 న శాకంతలం విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా శాకుంతలం మేకర్స్ సినిమాకు సంబంధించిన పలు ఆస్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. శాకుంతలంలో సమంత పాత్ర కోసం సుమారు రూ. 14 కోట్ల రూపాయల విలువైన నిజమైన బంగారం, […]
బలగం సినిమా.. ప్రజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ చిత్రం. కమెడియన్ వేణు డైరెక్షన్ లో వచ్చిన మంచి ఫీల్ గుడ్ మూవీ బలగం. ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉండగా తారక రత్న మరణం, ఆస్కార్ అవార్డుల కారణంగా కొంత ఆలస్యం అయ్యింది. కాగా ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ, జాన్వీకపూర్, ప్రశాంత్ నీల్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్,