Home / ప్రాంతీయం
AP Deputy CM Pawan Kalyan tweet about mgr: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 17తో తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ స్థాపించిన ‘ఏఐఏడీఎంకే’ పార్టీ ఏర్పాటై 53 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు ఎంజీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘పురచ్చి తలైవర్’ ఎంజీఆర్‌పై […]
Heavy Rains in telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం వద్ద సముద్ర మట్టానికి 1.5కి.మీ ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం ఏపీ తీరానికి దగ్గరగా కొనసాగుతోంది. ఈ […]
TTD Cancels Reverse Tendering System: టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసింది. ఈ మేరకు గత ఐదేళ్ల నుంచి అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఈఓ శ్యామలరావు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పాత పద్ధతిలోనే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అన్ని రకాల పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం […]
Full powers to Hydra: హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ మేరకు హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపడంతో తాజాగా, తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించిన గెజిట్ విడుదల చేసింది. దీంతో హైడ్రాకు చట్టబద్ధత వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, నాలాలు, కుంలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే […]
Rajendra Prasads daughter passes away: టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు. రాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే గాయత్రి ప్రేమ వివాహం చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చినట్లు తెలిసిందే. […]
సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)కు ఒడిశాలో ఇటీవలకేటాయించిన నైని కోల్ బ్లాక్‌లో మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో పంట రుణాల మాఫీని మూడు విడతల్లో ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు. బుధవారం ప్రజాభవన్‌లో జరిగిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యమైనట్లు కృష్ణాజిల్లా పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు. నర్సాపురం మాధవాయిపాలెం ఫెర్రి పాటదారుడి నుంచి బకాయిలు వసూళ్ల విషయంలో ఒత్తిడికి గురైన ఎంపీడీవో రమణారావు.. జులై మూడో తేదీ నుంచి మెడికల్ లీవ్‌పై వెళ్లారు.
గుడివాడలో ఇన్నాళ్లూ అక్రమంగా శరత్ థియేటర్‌ను అక్రమించుకుని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫోటోలను తొలగించింది థియేటర్ యజమాన్యం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది