Home / Andhrapradesh
Srisailam Temple : శ్రీశైలం మల్లన్న స్వామి వారిని దర్శించుకోవడానికి రోజూ వందల మంది భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తారు. కాగా, ఆలయంలో మరో తరహా మోసం వెలుగు చూసింది. కొంతమంది కేటుగాళ్లు దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆలయంలో వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను సందర్శించే భక్తులను మోసం […]
CM Chandrababu : ఏపీని వైసీపీ పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కోసం ముందుకెళ్తున్నామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? అని ప్రశ్నించారు. ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విమానంలో వస్తే చెట్లను […]
Nagababu : పిఠాపురం ప్రజలు, జన సైనికులకు రుణపడి ఉన్నామని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జయకేతనం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా 12 ఏళ్ల జనసేన పార్టీ ప్రస్థానంపై ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీని వేదికపై ప్రదర్శించారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. […]
Kurnool Holi tradition : దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా పండుగను ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. కొన్ని చోట్ల డీజే పాటలు పెట్టుకుని రంగులు చల్లుకుంటూ ఆడి పాడారు. హోలీని కొన్ని చోట్ల ఒక్కో రకంగా జరుపుకుంటున్నారు. పలు చోట్ల వింత ఆచారాలు కూడా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆచారాలను పాటిస్తూ గ్రామాల్లో హోలీ సంబురాలు జరుపుకుంటారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ వింత ఆచారం ఉంది. ఆ ఊరిలో రెండు […]
Amaravati Capital : ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే అన్ని అడ్డంకులు అధిగమించింది. ఈ క్రమంలోనే రాజధాని పనుల ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని కూటమి సర్కారు ఆహ్వానించింది. రెండు రోజుల కింద సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై అమరావతి నిర్మాణంపై చర్చించారు. ఏపీలో […]
Janasena Formation Day : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు తరలివస్తున్నారు. జయకేతనం అనే పేరిట నిర్వహిస్తున్నది. సభా వేదికపై 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఎన్ఆర్ఐ ప్రశాంత్ కొల్లిపర ఆధ్వర్యంలో అంతర్జాతీయస్థాయి సభలకు దీటుగా వేదిక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్, బిల్ క్లింటన్, జార్జి బుష్ సభలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం […]
AP CM Chandrababu : విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 1988లోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్మిషన్గా విభజించి, ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. విద్యుత్ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేశామన్నారు. ఆ రోజు తీసుకు వచ్చిన సంస్కరణల ఫలితాలను చూసి సంతోషపడ్డామన్నారు. వ్యవసాయానికి […]
Nara Lokesh : ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు స్టేజ్ పైనుంచి సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం పెంట జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు చింత రమణ విద్యార్థుల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని, విద్యార్థులను దండించకుండా గుంజీలు తీసిన […]
Nara Lokesh : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పీజీ విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ తొలగించిందని, తిరిగి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని, దీనిపై చర్చించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. సభలో చర్చించకుండా వైసీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయి తోకముడిచారని ఎద్దేవా చేశారు. విద్యాశాఖలో సంస్కరణలపై శాసన మండలిలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. ఈ సందర్భంగా […]
CM Chandrababu : కూటమి ప్రభుత్వంలో ఏ కార్యక్రమం మొదలు పెట్టినా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇవాళ శాసనసభలో ఆయన మాట్లాడారు. మహిళా సాధికారతను మాటల్లో చెప్పడం కాదని, చేతల్లో చేసి చూపించాలన్నారు. టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తుచేశారు. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారని, ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు […]