Home / ప్రాంతీయం
Property Tax Discount : ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2025 మార్చి 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే 50 శాతం వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ […]
HYDRA and GHMC Sensational Decision for Protection: హైడ్రా, జీహెచ్ఎంసీ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. హైదరాబాద్ నగరంలో అకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు, వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముప్పు తదతర సమస్యల నివారణపై హైడ్రా, జీహెచ్ఎంసీ స్పెషల ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగానే అగ్ని ప్రమాదాలు, వరద ముంపు నివారణకు రెండు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు నిర్ణయించారు. దీంతో పాటు చెరువుల సంరక్షణ, సుందరీకరణ, పునరుద్ధరణపై చర్చించారు. కాగా, జీహెచ్ఎంసీ […]
Kakani Govardhan Reddy : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన మరో నేత చిక్కుల్లో పడ్డారు. క్వార్జ్ ఖనిజం తరలించారనే ఫిర్యాదుతో నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో లీజు ముగిసినా క్వార్జ్ తరలించారని ఆరోపణలు వచ్చాయి. మైన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రూ.250 కోట్ల విలువైన క్వార్జ్ తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకాణి సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు […]
Gorantla Butchaiah Chowdary : నియోజకవర్గాల పునర్విభజనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాన్ అంతర్గతంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్డీఏలో తాము భాగస్వామ్యంగా ఉన్నందున బహిరంగంగా మాట్లాడకూడదని చెప్పారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా క్రమశిక్షణ పాటించాయన్నారు. ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని చెప్పారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపర గోబెల్స్‌లా మాట్లాడారని, […]
Komatireddy Rajagopal Reddy : తనకు ఆ శాఖ అంటే ఇష్టమని, కానీ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టాడు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఇవాళ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని, భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించానని పేర్కొన్నారు. […]
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ సొరంగంలో నెల రోజుల క్రితం ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ పురోగతి సాధించింది. ఇవాళ రెస్క్యూ ఆపరేషన్‌కు వెళ్లిన సిబ్బందికి మరో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. మృతదేహాన్ని వెలికి తీసి మధ్యాహ్నం బయటకు తీసుకొచ్చారు. మృతుడి యూపీకి చెందిన మనోజ్ కుమార్‌గా గుర్తించారు. టన్నెల్లో ఏఈగా విధులు నిర్వర్తిస్తూ ప్రమాదంలో చిక్కుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్న రెస్క్యూ టీంకు టీబీఎం శిథిలాల కింద దుర్వాసన వచ్చింది. దీంతో తవ్వకాలు […]
Supreme Court : తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించలేదన్నారు. నోటీసు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎలక్షన్లో పోటీ చేసి […]
Pawan Kalyan Mourns His Guru Shihan Hussaini Death: నటుడు, తన మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ గురువు షిహాన్ హుస్సైనీ మరణంపై సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన మరణవార్త తనని ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. ఈ మేరకు సీఎంవో కార్యలాయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన. “ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు, నాకు మార్షల్ […]
CM Chandrababu Announcement for Talliki Vandanam Scheme implemented by May: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మే నెలలో తల్లికి వందన పథకం ప్రారంభిస్తామని వెల్లడించారు. అందరి ఖాతాల్లో రూ.15వేల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందిస్తామని చెప్పారు. అయితే స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు ఇస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్‌ను […]
CM Chandrababu About DSC notification Announcement: సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. అమరావతిలో కలెక్టరతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభమయ్యే సరికి పోస్టింగ్స్ పూర్తి కావాలని చెప్పారు. అలాగే రెవెన్యూ భూ సమస్యలపై కలెక్టర్ల సదస్సులో చర్చించారు. ఈ మేరకు భవిష్యత్ లక్ష్యాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్కూళ్లు ప్రారంభ సమయానికే […]