Home / ఎడ్యుకేషన్ & కెరీర్
TGPSC Announced Group 3 Exam: తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ప్రకటించింది. నవంబర్ 17,18వ తేదీల్లో గ్రూప్-3 పరీక్షలను ఓఎమ్ఆర్ విధానంలో నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించింది. అయితే తాజాగా, షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందుగానే.. నవంబర్ 10వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఇప్పటికే శాంపిల్ ఓఎమ్ఆర్ ఆన్సర్ షీటును వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. గ్రూప్-3 పరీక్షల్లో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. తొలుత […]
Railway Notification: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇంజినీరింగ్ ఎగ్జామినేషన్ ద్వారా రైల్వేలో ఆఫీసర్ల రిక్రూట్మెంట్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నిజానికి ఐఆర్ఎంఎస్ టెక్నికల్ సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్ రైల్వే సర్వీస్‌ను డిసెంబర్ 2019లో క్యాబినెట్ ఆమోదించింది. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (IRMS) క్యాబినెట్ ఆమోదం పొందక ముందు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE),ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE) ద్వారా రైల్వే అధికారులను […]
SBI SO Recruitment 2024: ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చివరి తేదీని పొడిగించింది. SCO రిక్రూట్మెంట్ కోసం SBI చివరి తేదీని అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 14 వరకు పొడిగించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఎస్బీఐకి చెందిన వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1511 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు sbi.co.in లేదా bank.sbi/web/careers/current-openingsన ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు […]
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం గ్రేస్ మార్కులు ఇచ్చిన 1,563 NEET-UG 2024 అభ్యర్థుల స్కోర్‌కార్డ్‌లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. NEET ఫలితాలపై సుప్రీంకోర్టులో విచారణ సందర్బంగా ఎన్ టీ ఏ ఈ విషయాన్ని తెలియజేసింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ అండర్గ్రాడ్యుయేట్ (NEET UG) 2024 ఫలితాలు తీవ్ర వివాదంగా మారాయి. నీట్ పరీక్షలు మొదలైన తర్వాత నుంచి పలు వివాదాలు చుట్టుముట్టాయి. వాటిలో పేపర్ లీక్ కావడం ఒక ఎత్తైతే.. ఇష్టం వచ్చినట్లు మార్కులు ఇచ్చారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఏపీ ఈసెట్ 2024 - ( ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలు విడుదల అయ్యాయి. అనంతపురం జేఎన్టీయూ లోఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఈసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈసెట్ ఫలితాలలో బాలికలు 93.34 శాతం, బాలురు 89.35 శాతం విద్యార్ధుల ఉత్తీర్ణత సాధించారు.
తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) 2024 ఫలితాలు శనివారం ప్రకటించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వారిలో 1,80,424 మంది (74.98 శాతం) ప్రవేశానికి అర్హత సాధించారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ ఫలితాలను విడుదల చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 3వేల7వందల 43 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఇందులో మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న సివిల్స్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు జగనన్న సివిల్స్ ప్రోత్సాహక పథకం ప్రవేశపెడుతూ విధివిధానాలతో జీవో ఎంఎస్ 58 ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఈ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఈ నెల 15న టెట్ అర్హత పరీక్షను తెలంగాణ విద్యా శాఖ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ టెట్ లో అర్హత సాధిస్తే జీవిత కాలం వర్తిస్తుంది. ఈసారి టెట్ ఫలితాలతో పాటు ఫైనల్ కీ కూడా విడుదల చేశారు.