Home / AIMIM
ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఆయన పాలస్తీనా అనుకూల నినాదాలు చేయడంతో దుమారం రేగింది. బీజేపీకి చెందిన శోభా కరంద్లాజె అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ప్రిసైడింగ్ అధికారి రాధామోహన్ సింగ్ దానిని రికార్డు నుండి తొలగించాలని ఆదేశించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలప్రచారానికి వెళ్లిన ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కు షాక్ తగిలింది. ఆయన ప్రచారసభలో ముస్లిం యువకులు ఆయన వ్యతిరేకంగా గో బ్యాక్ నినాదాలు చేసారు.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై దాడి చేసిన తరహాలోనే గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో అదే ఓవైసీపై గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పై రాళ్ల దాడి చేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో లోపాన్ని బహిర్గతం చేస్తూ తాము ప్రయోజనాలను పొందుతామని ఒవైసీ అన్నారు.
హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
దేశంలో సర్వత్రా 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆహారం, జనాభా పెరుగుదలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తినటం, పిల్లల్ని కనడం అడవిలో జంతువులు కూడా చేస్తాయన్నారు. కానీ ఇది సభ్య సమాజంలో నివసించే మనుష్యులకు వర్తించదని అన్నారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ పేరు మార్చుతూ తీసుకున్న నిర్ణయం హాస్యస్పదమని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు. దీనిపై ఆయన ఎన్ సి సి అధినేత శరద్ పవార్ పై విమర్శలు గుప్పించారు.దీన్ని హిందూ-ముస్లిం సమస్యగా మార్చే వారు చాలా మంది ఉన్నారు. ఇది హిందువులు మరియు ముస్లింల గురించి కాదు.