Home / Andhrapradesh News
Posani Krishna Murali : ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి నరసరావుపేటలో నమోదైన కేసులో బెయిల్ మంజూరైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నరసారావుపేటలో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరైంది. మార్చి మొదటి వారంలో కృష్ణమురళిపై కేసు నమోదు కాగా, కేసులో పోలీసులు పిటి వారెంట్‌పై నరసరావుపేట కోర్టులో ఆయన్ను హాజరు పర్చారు. విచారణ చేపట్టిన కోర్టు పోసానికి పది రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో అతడిని నరసరావుపేట టూటౌన్ పోలీసులు గుంటూరు […]
TDP MLC Candidates : టీడీపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠకు తెరపడింది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర కసరత్తు చేసి, మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకు అవకాశం కల్పించారు. రేపటితో నామినేషన్ గడువు ముగియనున్నది. దీంతో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నిక జరుగనుండగా, ఒక స్థానాన్ని ఇప్పటికే మిత్రపక్షం జనసేన […]
CM Chandrababu : రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. […]
Ranganna : మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న కొద్ది రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. రంగన్న మృతదేహానికి కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించి పూడ్చి పెట్టారు. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ […]
Pawan Kalyan : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తు శిల్పి స్త్రీమూర్తి అన్నారు. తన కుటుంబాన్ని చక్కదిద్దడం నుంచి ప్రతి విభాగంలో అతివలు తమ బాధ్యతను విజయవంతంగా పోషిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన ప్రతి స్త్రీమూర్తికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఏపీలో […]
Pawan Kalyan : పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి దొరబాబును జనసేనలోకి ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మ, వైసీపీ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పార్టీ రాజకీయ […]
AP CM Chandrababu : వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ప్రత్యేక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతి అనుమానాస్పదంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ మృతిపై చర్చించారు. వివేకానందారెడ్డి హత్యకేసు సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందుతున్న అంశంపై గంటపాటు చర్చ జరిగింది. రంగన్నను పోలీసులు చంపారని ముందు వార్తలు రావడంపై మంత్రివర్గంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎలాంటి దురుద్దేశం లేకపోతే […]
AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ ముగిసింది. ఈ మేరకు 14 అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో డీపీవోలకు నేరుగా రిపోర్టు చేసేలా కేడర్‌లో మార్పు చేర్పుల నిర్ణయానికి ఆమోదం తెలిపింది. కేడర్ రేషనలైజేషన్‌పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. పౌరసేవలు ప్రజలకు అందేలా కేడర్‌లో మార్పు చేర్పులకు నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు […]
Naga Babu MLC Nomination : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బలపర్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం […]
Jagan Assets Issues: వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైఎస్ విజయలక్ష్మి, షర్మిల షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశ్రయించారు. కాగా, గురువారం కేసుపై ఎన్సీఎల్టీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల షేర్లు అక్రమంగా బదిలీ చేసుకున్నారని వైఎస్ జగన్ పిటిషన్లో తెలిపారు. షేర్ల బదిలీ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని అతడు కోరారు. విజయలక్ష్మి, […]