Home / Guidelines
తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షలు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వల్పకాలిక పంట రుణాలను మాఫీ చేయనున్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి చేశారు.
ఏపీలో ఇసుక మైనింగ్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టులోనూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులతో, ప్రతిపక్షాల తో ఎలా వ్యవహరించాలి, బహిరంగ సభలలో ఎలా మాట్లాడాలి అన్నఅంశాలపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు.
మాంసం, దాని ఉత్పత్తుల ఎగుమతులపై ‘హలాల్ సర్టిఫికెట్ పై కేంద్రం వివరణ ఇచ్చింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క బోర్డ్ ద్వారా గుర్తింపు పొందిన బాడీ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్‌ను కలిగి ఉన్న సదుపాయంలో ఉత్పత్తి చేసి, ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసిన మాంసం ఉత్పత్తులు మాత్రమే 'హలాల్ సర్టిఫైడ్'గా ఎగుమతి చేయడానికి అనుమతించబడతాయి.
దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.
భారతదేశంలో టీవీ ఛానెళ్ల అప్‌లింక్ మరియు డౌన్‌లింక్ కోసం కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఈవెంట్ల ప్రత్యక్ష ప్రసారాల కోసం పర్మిట్ హోల్డర్ల నుండి ముందస్తు అనుమతి అవసరం లేదు.