Budh Gochar In May 2025: కుంభ రాశిలోకి బుధుడి సంచారం.. మే 23 నుండి వీరిపై కనక వర్షం

Budh Gochar In May 2025: గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు మే 23, 2025న మధ్యాహ్నం 1:05 గంటలకు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలో జూన్ 6, 2025 వరకు బుధుడు సంచారం చేయబోతున్నాడు. ప్రత్యేకత ఏమిటంటే.. బుధుని రాశి మార్పు 12 రాశుల వారి జీవితాల్లో మార్పులను తీసుకువస్తుంది.
బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, గణితం వ్యాపారానికి అధిపతి కాబట్టి.. ఈ రంగాలలో ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. బుధ గ్రహ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు వ్యాపారంలో లాభం, వృత్తిలో విజయం , మధురమైన మాటల వల్ల గౌరవం పొందుతారు. బుధుడి రాశి మార్పు ఏ రాశుల వారికి ప్రయోజనాలు అందిస్తుందో తెలుసుకుందామా..
మిథున రాశి: బుధుడు రాశి మార్పు వల్ల మిథున రాశి వారికి లాభాలు అధికంగా ఉంటాయి. మీ గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఆఫీసుల్లో సీనియర్ అధికారుల మద్దతు, సహకారం అలాగే ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాల కోసం కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు మీ కెరీర్‌లో మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో.. కొత్తగా ఏదైనా చేయాలనే మీ ప్రయత్నం విజయవంతమవుతుంది.
సింహ రాశి: సింహ రాశి వారి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. బుధగ్రహ ప్రభావం వల్ల.. మీ కెరీర్ సంబంధిత విషయాలలో విశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. పెట్టుబడి.. ఆస్తి, విద్యలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీ పిల్లల జీవితంలో జరుగుతున్న సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యాపారంలో నిలిచిపోయిన ప్రణాళికలు విజయవంతమవుతాయి.
కుంభ రాశి: కుంభ రాశి వారికి తగిన జీవిత భాగస్వామి దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి.. బుధుడి సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయం మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెడతారు. చదువులకు సంబంధించిన పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. అసంపూర్ణమైన పనులలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యాపారంలో పెద్ద ఆర్డర్ పొందే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుండి మంచి లాభాలు పొందుతారు. అంతే కాకుండా మీ వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతాయి.