Home / vijayakanth
కోలీవుడ్ లో విజయవంతమైన నటుడిగా నిరూపించుకున్న విజయకాంత్ సెప్టెంబర్ 2005లో డీఎండీకేని స్థాపించడం ద్వారా తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంటరయ్యారు. తమిళనాట అప్పటికే సంస్దాగతంగా బలంగా ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) మరియు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) లకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నించారు.
డీఎండీఏ పార్టీ అధినేత, ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కాంత్ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నై ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ కొంతకాలం క్రితం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనని కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు.
కెప్టెన్ విజయకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. 90ల్లో ఆయన నటించిన తమిళ సినిమాలు చాలానే తెలుగులో అనువాదమయ్యాయి.