Shao Chun Chen : వారానికి 3 గంటలే పని.. నెలకు రూ.2.6 లక్షల జీతం

Former Google techie Shao Chun Chen has a New Job : అతడు వారానికి 3 గంటలే పనిచేస్తాడు. కానీ, నెలకు మాత్రం జీతం రూ.2.6 లక్షల తీసుకుంటున్నాడు. ఉద్యోగం కోసం థాయిలాండ్ నుంచి సింగపూర్‌కు ప్రయాణం చేస్తున్నాడు. షావో చున్ చెన్ సింగపూర్‌లో తన కార్పొరేట్ కెరీర్లో వారానికి 40 గంటలకు పైగా పనిచేసిన.. అతడు ఇప్పుడు వారానికి 3 గంటలే ఉద్యోగం చేస్తున్నాడు. థాయిలాండ్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. సింగపూర్ నేషనల్ యూనివర్శిటీలో అనుబంధ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగం కోసం వారానికోసారి సింగపూర్‌కు ప్రయాణిస్తుంటాడు. నెలకు రూ.2.6 లక్షలు జీతం తీసుకుంటున్నాడు.
గూగుల్ నుంచి తొలగింపు..
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వారానికోసారి 3 గంటలే డిజిటల్ మార్కెటింగ్ బోధిస్తానని తెలిపారు. తన 38వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా తనను గూగుల్ నుంచి తొలగించారని పేర్కొన్నారు. దాదాపు దశాబ్దంపాటు గూగుల్‌లో పనిచేసినట్లు చెప్పారు. తన ఆదాయానికి తగ్గట్టుగా జీవించానని తెలిపారు. తన జీతంలో దాదాపు సగం వరకు పెట్టుబడుల కోసమే కేటాయించానని పేర్కొన్నారు. ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత తాను ఏండ్లుగా నిర్మించుకున్న ఏడు అంకెల పోర్ట్‌ఫోలియోతో ఎక్కువ కాలం జీతంపై ఆధార పడాల్సిన అవసరం లేదని గ్రహించాడు.
15 ఏళ్లుగా పని..
తన జీవితంలో 14 ఏళ్లుగా పని చేశానని తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగింపు కారణంగా తాను విరామం తీసుకోవాల్సిన వచ్చిందని పేర్కొన్నారు. ఇది నా గుర్తింపుకు పెద్ద దెబ్బ అన్నారు. కాలక్రమేణా జీవితంలో తాను నిజంగా ఏమి కోరుకుంటున్నానో దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టినట్లు అన్నారు.
యూట్యూబ్‌లో విద్యా కంటెంట్‌గా..
ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత తన మనసుకు నచ్చిన పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలని ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు. విశ్వవిద్యాలయంలో బోధించడమే కాకుండా, యూట్యూబ్‌లో విద్యా కంటెంట్‌ను సృష్టించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని ఆలోచించి ముందడుగు వేశానని చెప్పుకొచ్చాడు. అతడు గంటకు రూ.500 వసూలు చేస్తానని చెప్పాడు.
నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి..
మీరు కూడా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. గంటకు అధిక రేటు వసూలు చేయగల స్థితికి చేరుకోవడానికి ఒక మార్గాన్ని కనుక్కోవాలని చెన్ అన్నారు. సింగపూర్ కంటే జీవన వ్యయం తక్కువగా ఉన్న థాయిలాండ్‌ను ఎంచుకున్నానని, అందుకే తన భార్యతో మంచి జీవితాన్ని గడపటానికి తాను అంతగా పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. అధిక గంట రేటు చెల్లించగల నగరాలు, ఉద్యోగాలు ఖరీదైన ప్రాంతాలుగా ఉంటాయని, కానీ, డిజిటలైజేషన్ రిమోట్ వర్క్ ఏర్పాట్లను సాధ్యం చేసినందున ఇప్పుడు అది తక్కువ సమస్య అన్నారు. తాను వారానికి 4 నుంచి 8 గంటలు పనిచేస్తానని చెప్పాడు. బోధన, శిక్షణ, యూట్యూబ్ వీడియోలను తయారు చేయడం ఉందన్నారు.