Home / Benjamin Netanyahu
ఇజ్రాయెల్ దళాల నేతృత్వంలోని సెంట్రల్ గాజాలో ఆదివారం జరిగిన వైమానిక దాడులకలో కనీసం 68 మంది మృతిచెందారు. వీరిలో 12 మంది మహిళలు మరియు ఏడుగురు పిల్లలు ఉన్నారు.ఉత్తర గాజాలోని హమాస్ యొక్క భూగర్భ సొరంగం నెట్వర్క్ నుండి బందిఖానాలో చంపబడిన ఐదుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) పేర్కొంది.
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధానికి కాస్తా విరామం లభించింది. ఖతార్ మధ్యవర్తిత్వం అమల్లోకి వచ్చింది. వాస్తవానికి గురువారం నుంచి కాల్పుల విమరణ అమలు కావాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక పరమైన అంశాల వల్ల శుక్రవారానికి వాయిదా పడింది. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది.
గాజా వెలుపల కూడా హమాస్ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వారిపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ దేశ గూఢచారి సంస్థ మొసాద్ ను ఆదేశించారు.ఒక వార్తా సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని మాట్లాడుతూ హమాస్ అధినేతలు ఎక్కడ ఉన్నా వారిపై చర్య తీసుకోవాలని నేను మొసాద్‌కు సూచించాను అని అన్నారు
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజా స్ట్రిప్ నుండి హమాస్‌ను తుడిచిపెట్టేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ మిలటరీ గురువారం నాడు, గాజాలో 3,60,000 మంది బలగాలతో గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. అయితే, రాజకీయ నాయకత్వం ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదని ఉన్నత సైనిక అధికారి చెప్పారు.