Home / Undavalli Arun Kumar
తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయదలచుకొలేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సోమవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఫలితాలు ఎలా వుంటాయో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల మార్పు అన్నది అంత ఈజీ కాదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తనను సీఎంను చేయాలని సోనియా గాంధీ వద్దకు జగన్ వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలే ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎదురవుతున్నాయని ఉండవల్లి చెప్పారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును సీబీఐకి ఇవ్వాలన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్‌పై విచారణ డిసెంబర్ 13కి వాయిదా పడింది. ఈ కేసులో కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్ తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిందితుడిగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పిల్ వేశారు.
సినిమా పరిశ్రమ పిచ్చుక లాంటిదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల ఫంక్షన్ లో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్దించారు.చిరంజీవి వ్యాఖ్యలకు అర్థం వుంది. చిరంజీవి సామాన్య వ్యక్తి కాదని ఉండవల్లి అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలసి ఉండాలన్నదే ఇప్పటికీ తమ విధానమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
విశాఖ ప్రైవేటీకరణపై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. దేశం, రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు బలంగా ఉండాలని తద్వారా ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను తిప్పి కొట్టవచ్చని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం జరిగే ఉద్యమంలో ఒకొక్కరు కాకుండా కుటుంబ సమేతంగా లేదా మూకుమ్మడిగా వందలు వేలాది మంది తరలిరావడం ద్వారానే మన ఉక్కుపరిశ్రమను మనం కాపాడుకోగలమని ఆయన తెలిపారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ తరచుగా చేసే విమర్శల్లో ముఖ్యమైనది ఏమిటంటే మామకు వెన్నుపోటు పొడిచాడు. అయితే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ వెన్నుపోటు విమర్శల పై గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
వైఎస్ చనిపోవడానికి 12 రోజుల ముందే పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనుమతులన్నీ వచ్చాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. గోదావరి నీటితో కోస్తాంధ్రని, కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేయాలని వైఎస్ కలలుగన్నారని అన్నారు.