Home / Sameer Wankhede
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబయి యూనిట్ మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ను జూన్ 8 వరకు అరెస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది.వాంఖడేకు ఉపశమనం కల్పించే ముందు హైకోర్టు కొన్ని షరతులు విధించింది.
ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే ను షారూఖ్ ఖాన్ నుండి రూ. 25 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం ఐదు గంటలకు పైగా ప్రశ్నించింది.
డ్రగ్స్ కేసులో తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేసేందుకు బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నుండి రూ.25 కోట్లు దోపిడీకి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడే షారూఖ్ ఖాన్ తనతో మాట్లాడిన వాట్సాప్ సంభాషణలను బయటపెట్టారు
డ్రగ్స్ కేసులో నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే తన కుటుంబంతో కలిసి విదేశాలకు అనేకసార్లు పర్యటించారని, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సీబీఐ నివేదిక పేర్కొంది
జైలులో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు నవాబ్ మాలిక్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ డైరక్టర్ సమీర్ వాంఖడే ఆదివారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖకు చెందిన ముంబై జిల్లా కుల ధృవీకరణ కమిటీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత ఆయన ఈ చర్య తీసుకున్నారు.
కుల వివాదం కేసులో ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు కుల పరిశీలన కమిటీ శనివారం క్లీన్ చిట్ ఇచ్చింది. వాంఖడే పుట్టుకతో ముస్లిం కాదని ఆ ఉత్తర్వు చెబుతోంది.అతను మరియు అతని తండ్రి ఇస్లాంలోకి మారినట్లు ఇంకా రుజువు కాలేదని, అయితే, వారు హిందూ మహర్ 37 షెడ్యూల్డ్ కులానికి చెందినవారని రుజువైంది.