Home / Rains in ap
తెలుగు రాష్ట్రాలను వానలు వదిలేలా కనిపించడం లేదు. ఒక వైపు భానుడి భాగభగలు ఉంటూనే మరోవైపు.. వానలు కూడా దంచికొడుతున్నాయి. అయితే ఏపీ, తెలంగాణాల్లో ఇప్పటికే వర్షాలు దుమ్ములేపుతుండగా.. మరో రెండు, మూడు రోజుల పాటు మళ్ళీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆదివారం రాష్ట్రంలో అల్లూరి,
ఒక వైపు మండిపోయే ఎండాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు ఉచినచ్చని రీతిలో వర్షాలు కూరుస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కాగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెయిన్ అలెర్ట్ వచ్చేసింది. ఉపరితల ఆవర్తనం బంగ్లాదేశ్, పొరుగు ప్రాంతాల నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా మీద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవరించి ఉన్నట్లు సమాచారం అందుతుంది. అదే విధంగా ఉత్తర అంతర్గత తమిళనాడు నుంచి కొంకణ్ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు తీరప్రాంతం, అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తు వరకు విస్తరించి వుంది.
జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. పలుచోట్ల తేలికపాటిగాను, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.