Albanian PM : మోకాళ్లపై కూర్చుని ఇటలీ ప్రధానికి స్వాగతం పలికిన అల్బేనియా దేశాధినేత.. వీడియో వైరల్

Albanian President AD Rama in the spotlight : అల్బేనియా దేశాధినేత ఏడీ రామా చర్చలో నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి రెడ్ కార్పెట్‌పై స్వాగతం పలుకుతున్న సమయంలో మోకాళ్లపై కూర్చుని భారత్ సంప్రదాయంలో నమస్తే చెప్పారు. అల్బేనియాలోని తిరనాలో జరుగుతున్న యురోపియన్ దేశాల సమావేశంలో ఘటన జరిగింది. రెడ్ కార్పెట్‌పై నడిచి వస్తున్న మెలోనీ అల్బేనియా దేశాధినేత స్టంట్ చూసి అవాక్కైయ్యారు. ఆమె తన నవ్వును ఆపుకోలేకపోయారు. కొద్దిగా వర్షం కురుస్తున్న వేళ చేతిలో గొడుగుతో వచ్చిన రామా అకస్మాత్తుగా గొడుగును పక్కన పడేసి మోకాళ్లపై కూర్చుని రెండు చేతులు జోడించి మెలోనీకి నమస్తే చెప్పారు. ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
ఇది మొదటిసారి కాదు..
ఆరు అడుగుల ఏడు ఇంచులు ఉండే రామా ఇలాంటి స్టంట్ క్రియేట్ ఇదే మొదటిసారి కాదు. గతంలో అబుదాబిలో జరిగిన సమావేశంలో మెలోనీ ముందు మోకాళ్లపై అల్బేనియా దేశాధినేత కూర్చుని దండం పెట్టారు. అల్బేనియా, ఇటలీ ప్రధానుల మధ్య మంచి అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది. రామా వెల్కమ్ పలికిన తీరు పట్ల నవ్వులు పూయించాయి. సుమారు 40 మంది యురోపియన్ నేతలు తిరనా భేటీకి హాజరవుతున్నారు. ఉక్రెయిన్‌తో పాటు శరణార్థుల అంశాన్ని చర్చించనున్నారు.