Home / Monkeypox Virus
ఈ ఏడాది భారత్ సహా పలు దేశాలను భయపెడుతోన్న మంకీపాక్స్కు కొత్త పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మంకీపాక్స్ అనే పేరు జాత్యహంకారానికి కారణం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దాని పేరును ‘ఎంపాక్స్’గా మార్చింది.
ఢిల్లీలోని ఒక నైజీరియన్ మహిళకు మంకీ ఫాక్స్ పాజిటీవ్ గా నిర్దారణ కావడంతో భారత్ లో కేసులసంఖ్య 13కి చేరుకుంది. మంకీపాక్స్తో బాధపడుతున్న మరో వ్యక్తి కూడా ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామో ఘెబ్రేయేషన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇప్పటి వరకు మంకీపాక్స్ 92 దేశాలకు విస్తరించగా, 35వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న ప్రజలపై వైరస్లు దండయాత్ర మొదలుపెట్టాయి. ఇప్పటికే కరోనాతో పాటు జికా వైరస్లు దేశంలో వ్యాప్తి చెందుతుండగా.. ఇప్పుడు దానికి మంకీపాక్స్ తోడైంది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్లాంకు చెందిన
ఇటీవల విదేశాల నుండి కేరళ కు తిరిగి వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ లక్షణాలను ఉండటంతో ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే వ్యాధి నిర్ధారణ అవుతుందని ఆమె తెలిపారు. ఆ వ్యక్తికి వైరస్ లక్షణాలు కనిపించాయని, విదేశాల్లో ఉన్న మంకీపాక్స్ రోగితో సన్నిహితంగా ఉన్నారని జార్జ్ చెప్పారు.