Published On:

contacts : మీ మొబైల్‌లో కాంటాక్ట్ నంబర్లు మిస్ అయ్యాయా.. ఇలా చేస్తే తిరిగి వస్తాయి..

contacts : మీ మొబైల్‌లో కాంటాక్ట్ నంబర్లు మిస్ అయ్యాయా.. ఇలా చేస్తే తిరిగి వస్తాయి..

contacts : మీ మొబైల్‌లో మిస్ అయిన కాంటాక్ట్ నంబర్లు పోతే.. ఇప్పుడు ఆందోళన వద్దు.. పోయిన నంబర్లను తిరిగి పొందవచ్చు. ఆండ్రాయిడ్​ మొబైల్‌లో అయితే ముందుగా సెట్టింగ్‌కు వెళ్లాలి. సెట్టింగ్‌లో గూగుల్​ ఆప్షన్ ఎంచుకుని గూగుల్ అకౌంట్ మేనేజ్​మెంట్​పై ట్యాప్ చేయాలి. తర్వాత పీపుల్ అండ్ షేరింగ్ ఆప్షన్​ ఓపెన్ చేసి కాంటాక్ట్స్‌కు వెళ్లాలి. ఏదైనా బ్రౌజర్​లో contacts.google.com ఓపెన్ చేసి గూగుల్ అకౌంట్​తో లాగిన్ కావాలి. గూగుల్​తో అప్​డేట్ చేసిన పాత నంబర్లు కనిపిస్తాయి. నంబర్లు డిలీట్ అయి ఉంటే మెనూకు వెళ్లి undo changes సెలక్టు చేయాలి. అవసరం అయితే కస్టం తేదీ సెట్ చేసి కాంటాక్ట్ నంబర్లను తిరిగి పొందవచ్చు. ఐఫోన్​లో ముందుగా icloudతో అప్​డేట్ చేయాలి.

 

ఐఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లి ఆపిల్ ఐడీపై ట్యాప్ చేయాలి. అందులో ఐక్లౌడ్‌కు వెళ్లి కాంటాక్ట్స్ స్విచ్‌ను టోగుల్ చేయాలి. అప్పటికే ఆన్​ ఉంటే నంబర్లు మొబైల్‌లో ఆటోమెటిక్​గా కనిపిస్తాయి. ల్యాప్ ట్యాప్ లేదా బ్రౌజర్​లో icloud.com ఓపెన్ చేసి ఆపిల్ ఐడీతో లాగిన్ చేయాలి. తర్వాత అకౌంట్ సెట్టింగ్స్​కు వెళ్లి ఆపై కాంటాక్ట్​ను రీస్టోర్ ఆప్షన్ ఎంచుకోవాలి.

 

ట్రూకాలర్ యాప్ వాడే యూజర్లకు బ్యాకప్ ఇది చాలా ఈజీ. ఎందుకంటే నంబర్లు అందులో సేవ్ అయి ఉంటాయి. ట్రూకాలర్ లాగిన్ చేసి బ్యాకప్ ఆప్షన్ ఆన్​లో ఉంటే వెంటనే నంబర్ల లిస్ట్ రీస్టోర్ చేసుకోవచ్చు. మెసేజ్​ యాప్​లో ఎప్పుడైనా ఎస్​ఎంఎస్​లు వాడి ఉంటే అక్కడ కాంటాక్ట్స్ చూడొచ్చు.

ఇవి కూడా చదవండి: