Home / Ganesh Nimajjanam
గణనాథునికి 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం ఎంతో సందడిగా గణేషునికి వీడ్కోలు పలుకుతుంటాము. కాగా హర్యానాలో నిర్వహించిన బొజ్జగణపయ్య నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఏడుగురు వ్యక్తులు నీటమునిగి చనిపోయారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
హైదరాబాద్ లో శుక్రవారం జరగబోయే గణేశ్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రోడ్ల పై రద్దీని తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు కోరారు.
హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం పై వివాదం తొలగిపోయింది. రేపటి నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ పై జిహెచ్ఎంసి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాల కోసం ఏకంగా 15 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గంలో 9, పీవీ మార్గ్ లో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు.