BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు.. ఏపీ, తెలంగాణలోనూ ఖాళీలు, టెన్త్ పాసైతే చాలు

BANK OF BARODA: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. టెన్త్ క్లాస్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 500
విద్యార్హత: పదో తరగతి పాసై ఉండాలి. అలాగే స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 3
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 23
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీస్ అసిస్టెంట్ (ఫ్యూన్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు రాష్ట్రాల వారీగా..
ఏపీ: 22 ఉద్యోగాలు
తెలంగాణ: 13 ఉద్యోగాలు
వయస్సు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600 ఫీజు ఉండును. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 పే చేయాల్సి ఉంటుంది.
జాబ్‌కు సెలెక్టే చేసే విధానం: రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష ఆధారంగా..
జీతం: నెలకు రూ.19,500 ఫీజు ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.bankofbaroda.in/
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 500
దరఖాస్తుకు లాస్ట్ డేట్: 2025 మే 23
జీతం: రూ.19,500