Home / Exit polls
ఎగ్జిట్ పోల్స్‌ను ఇండియా కూటమి తేలికగా కొట్టిపారేసింది. 2024 లోకసభ ఎన్నికలల్లో ప్రస్తుతం వస్తున్న ఎగ్జిట్‌పోల్స్‌కు పూర్తిగా వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయని ప్రతిపక్ష పార్టీ భావిస్తోంది. కాగా దేశంలోని పలు చానల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్నీ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘనవిజయం సాధిస్తుందని అంచనా వేశాయి.
మధ్యప్రధేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం,రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. వీటిలో ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ తిరిగి అధికారం నిలబెట్టుకునే పరిస్దితి కనపడుతోంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉండగా రాజస్దాన్ లో బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
కర్ణాటకలో ఎన్నికలు ముగిశాయి. మే 13 (శనివారం) రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోనుంది. దీంతో నాయకుల్లో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి.
Karnataka Exit Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఎన్నిక ముగిసిన తర్వాత.. ఎగ్జిట్ పోల్ సర్వేలు ఆయా పార్టీల విజయావకాశాలను అంచనా వేశాయి.
కర్ణాటకలో ఎన్నికలకు కేవలం మిగిలింది నాలుగు రోజులు మాత్రమే. ఈ నెల 10 వ తేదీన రాష్ర్టంలో పోలింగ్ జరగనుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనిపిస్తోందని కనీసం మూడు ఒపియన్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ సారి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఒపినీయన్ పోల్స్ తేల్చేశాయి.