Home / Assembly sessions
Deputy CM Pawan Kalyan in assembly sessions: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే ప్రభుత్వ ధ్యేయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శాసనమండలిలో గ్రామాల్లో డంపింగ్ యార్డులపై చర్చ జరిగింది. ఈ మేరకు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలు చెప్పారు. గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగానే 15వ ఫైనాన్స్ నిధులు సంపద సృష్టి కేంద్రాలకు కేటాయించామని […]
విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి సభలో మంత్రి భట్టి విక్రమార్క చదివి వినిపించారు. ప్రస్తుతం అప్పుల పరిస్థితి చూస్తే.ఆందోళన కరంగా ఉందని తెలిపారు.
గత కాంగ్రెస్ హయాంలో అధ్వాన్నంగా ఉన్న విద్యుత్ రంగాన్ని 2014 తర్వాత పునరుద్ధరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మోటార్లు కాలిపోయాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయని, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు ఉన్నాయని ఎన్నో వార్తలు వచ్చాయన్నారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో (ఆగస్టు 6) ముగియనున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు చివరివి. మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. చివరి రోజైన ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. కాగా ఈ తరుణంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
CM KCR: చివరి రోజైనా బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన కేసీఆర్.. కేంద్రం ధ్వజమెత్తారు. అభివృద్ధిలో సాగుతున్న భారతదేశం ను మోదీ ప్రభుత్వం వెనక్కి నెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో పోలిస్తే.. మోదీ ప్రభుత్వం అభివృద్ధి అన్నింటిలో వెనకబడిందని విమర్శలు గుప్పించారు. 2024లో భాజపా ఓడిపోవడం ఖాయమని కేసీఆర్ అన్నారు.
Etala vs Ktr: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటాల యుద్ధాలు జరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య.. మాటల తూటాలు పేలుతున్నాయి. పద్దులపై చర్చలో భాగంగా.. ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈటల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. ఆయనకు చురకలు అంటించారు.
Ktr in Assembly: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వమే టార్గెట్ గా కేటీఆర్ ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని వివరిస్తూ.. కేటీఆర్ ప్రసంగించారు.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. సభలో కార్యక్రమాల నిర్వహణకు అడ్డుపడుతున్నారంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సస్పెన్షన్ తీర్మానం ప్రతిపాదించగా, స్పీకర్ వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
మంత్రి మేరుగ నాగార్జున టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి పై చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. దళితులకే పుట్టావా అంటూ మంత్రి మేరుగ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి (సెప్టెంబర్ 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.