Home / Pragathi Bhavan
తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. పోరాటాలతో, త్యాగాలే పునాదిగా ఏర్పడిన రాష్ట్రమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రమంతా సమానమైన అభివృద్ది చేయాలన్న సోనియా గాంధీ సంకల్పంతో తెలంగాణ ఏర్పడింది. కాని దశాబ్దకాలం మానవహక్కులకు చోటు లేకుండా పోయిందన్నారు.
ప్రగతి భవన్ పేరును ఇకపై బిఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మార్చుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అద్బుతమైన తీర్పు ఇచ్చారంరటూ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సచివాలయం గేట్లు ఇకపై సాధారణ ప్రజలకు కూడా తెరిచి ఉంటాయని చెప్పారు.
CM KCR: సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం కావాలనే దిల్లీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు.
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ ముగిసింది. కొద్ది నిమిషాల క్రితమే ప్రగతిభవన్ నుండి బయలుదేరారు పైలట్ రోహిత్ రెడ్డి.
ప్రగతిభవన్ వద్ద హైడ్రామా నెలకొంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న షర్మిల కాన్వాయ్ పై తెరాస కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ ధ్వంసమైన కారులో భారీ కాన్వాయ్‌తో నేడు ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల యత్నించారు. దానితో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమాజిగూడ వద్ద షర్మిలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
యావత్తు దేశంలో పెద్ద చర్చకు దారితీసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని జాతీయ పార్టీ గా మారుస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీగా జీవం పోసుకొన్న కీలక తరుణంలో మరో వాదం తెరపైకి వచ్చింది. సీఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ అవిష్కరణ సమయంలో ఆమె గైర్హాజరుపై సర్వత్రా చర్చకు దారితీసింది. నెట్టింట ఎందుకు పాల్గొనలేదనంటూ విభన కధనాలను వ్యాపిస్తున్నారు.
దసరా సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.