Anasuya Bharadwaj: అందుకే నా కొడుక్కి ఆయన పేరు పెట్టుకున్నా.. గృహ ప్రవేశం సందర్భంగా ఎమోషనలైన అనసూయ

Anasuya House Warming Ceremony: యాంకర్ అనసూయ తన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే కొత్తింటి గృహ ప్రవేశం చేసిన ఫోటోలు షేర్ చేసింది.

ఈ నెల 3న తాము తమ కొత్త ఇంట్లో హోమాలు, పూజలు, సత్యన్నారాయణ వ్రతం, రుద్రాభిషేకం చేసుకున్నట్లు అనసూయ తెలిపారు. తమ గురువు గారి సూచన మేరకు 'శ్రీరామ సంజీవని' అని పేరు పెట్టామని చెప్పింది.

హోమం అనంతరం పండితులు తన ఫోన్లో అనసూయ.. ఆంజనేయుడు వచ్చాడంటూ ఫోన్ చూపించారని, దాంతో తాను ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యానని చెప్పింది.

నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ సంతోషం, దుఃఖం, ఆందోళన, ప్రేమ అన్నింటిలోనూ 'జై హనుమాన్' అని తలుచుకోకుండా తానేమీ చేయనని తెలిపింది.

తన కన్న తండ్రి తర్వాత ఆ హనుమంతుడినే తన ఆప్తుడిగా భావిస్తానని తన ఆప్తులందరికీ తెలుసని అనసూయ తెలిపారు.

అందుకే తన పెద్ద కొడుకుకి 'శౌర్య' అని ఆయన పేరు పెట్టుకున్నానంటూ అనసూయ గృహ ప్రవేశం సందర్భంగా తనకు ఎదురైన అనుభూతిని పంచుకుంది

హోమం సందర్భంగా తన ఇంటికి ఆంజనేయుడు వచ్చాడంటూ అనసూయ ఎమోషనల్ అయ్యారు. 'అందుగలడు ఇందులేడని సందేహం వలదు. ఎందెందు చూసినా అందందే గలడు' అంటూ పోస్ట్ షేర్ చేసింది

అగ్నిదేవుడిని ముక్కోడి దేవతలకు వార్తహరుడిగా చెప్పుకొంటారని అనసూయ తెలిపారు. అందుకే ఏ దేవునికి గట్టిగా చెప్పుకోవాలన్నా హోమం ద్వారా చెప్పుకుంటామంది.

హోమం, వ్రతం అన్నీ జరుగుతుండగా.. ఆ రోజు హనుమాన్జీ తమ ఇంటి పేరు, తమ ఇంటిని, తమను ఆశీర్వదించడానికి వచ్చాడని అనసూయ తెలిపింది

అందరూ ఆధ్యాత్మికంగా ఉండరని తెలిసినా.. తనకు ఎదురైన భగవత్ సాక్షాత్కారాన్ని అందరితో పంచుకోవాలనిపించి ఈ పోస్ట్ చేస్తున్నట్లు అనసూయ పేర్కొంది