Published On:

Golden Temple: పాక్ క్షిపణుల నుండి గోల్డెన్ టెంపుల్ ను ఎలా కాపాడామంటే

Golden Temple: పాక్ క్షిపణుల నుండి గోల్డెన్ టెంపుల్ ను ఎలా కాపాడామంటే

Indian Army How they saved golden Temple from Pakistan missiles: పహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. అందుకు ప్రతీకారంగా పాకిస్థాన్ స్వర్ణదేవాలయంపైకి క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. అయితే స్వర్ణదేవాలయంపై ఈగను కూడా వాలకుండా పాక్ క్షిపణులను అడ్డుకుంది భారత ఆర్మీ. 15వ పదాతిదళం జనరల్ ఆఫీసర్ కమాండింగ్  కార్తీక్ సి శేషాద్రి మాట్లాడారు. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులనన్నింటిని కూల్చివేసినట్లు తెలిపారు.

 

పాకిస్తాన్ నుంచి ఇలాంటి నీతిలేని పనులను ముందే ఊహించినట్లు జనరల్ తెలిపారు. పాకిస్తాన్ సైన్యానికి ఎలాంటి నిబందనలు లేవని అన్నారు. వాళ్లు భారత సైనిక స్థావరాలతో పాటు, మతపరమైన, పౌర లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుంటారని ముందే ఊహించినట్లు చెప్పారు. గోల్డెన్ టెంపుల్ ను రక్షించడానికి ఆధునీకరించిన ఆయుధాలను వాడినట్లు చెప్పారు. మే 8న మానవరహితమైన డ్రోన్లతో అమృత్ సర్ స్వర్ణదేవాలయంపై దాడి చేయాలని చూసిందన్నారు.

 

ఆకాశ్ క్షిపణి వ్యవస్థ L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ తో సహా భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అమృత్ సర్ స్వర్ణదేవాలయాన్ని మరియు పంజాబ్ లోని నగరాలను కాపాడినట్లు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి: