Home / Munugode Bypolls
మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజా దీవెన బహిరంగ సభ నిర్వహిస్తోంది. మునుగోడులో లక్ష మందితో నిర్వహించనున్న ‘ప్రజా దీవెన’ సభకు సీఎం కేసీఆర్ హాజరవనున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు తనకు లేదన్నారు. చండూరు సభలో తనను అసభ్యకరంగా తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్టు టీఆర్ఎస్ నేతలు సంకేతాలు ఇవ్వడంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. కొమటిరెడ్డి బద్రర్స్ పై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎలాగైన మునుగోడును గెలుచుకోవాలని భావిస్తున్నారు.