Home / Brij Bhushan Sharan Singh
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. మహిళా రెస్లర్లను లైంగికంగా వేధించాడని ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో క్రీడాకారులంతా ఆయనను అరెస్టు చేయాలని, ఆయన చేతిలో తాము లైంగిక వేధింపులకు గురయ్యామని ప్రధాని నుంచి హోంమంత్రి వరకు ప్రతి ఒక్కరికి ఫిర్యాదు చేశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లను బెదిరించారని, వారిని మౌనంగా ఉండమని కోరారని, ఈ కేసుపై విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు రూస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్ పై అభియోగాలు మోపాలా వద్దా అనే దానిపై కొత్తగా వాదనలు ప్రారంభమవడంతో ఢిల్లీ పోలీసులు గురువారం ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం 2 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు గురువారం వాదనలు విననుంది.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన భారత స్టార్ రెజ్లర్లు శనివారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయితేనే ఈ ఏడాది జరగబోయే ఏషియన్ గేమ్స్ లో పాల్గొంటామని..
లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా భారత స్టార్ రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన తర్వాత విధుల్లో చేరారు. అయితే ఆందోళన మాత్రం కొనసాగిస్తామని తెలిపారు.
హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో ఖాప్ 'మహాపంచాయత్' ముగిసింది. రైతు సంఘాల నాయకుడు రాకేష్ తికాయత్ కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ మరియు భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని కోరారు.
:తనపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 5న అయోధ్యలో జరగాల్సిన తన ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రకటించారు. ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించడంతో ఈ ప్రకటన వెలువడింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ మరియు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు మరియు 10 ఫిర్యాదులు దాఖలు చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెజ్లర్లు తమ పతకాలను గంగలో నిమజ్జనం చేసేందుకు మంగళవారం హరిద్వార్ చేరుకున్నారు. సమస్య పరిష్కారానికి ఐదు రోజుల సమయం కావాలని రైతు నాయకులు కోరడంతో పథకం విరమించుకున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం స్థానిక కోర్టులో సమర్పించిన దర్యాప్తుపై తమ స్టేటస్ నివేదికలో తెలిపారు.