Home / Umesh Pal murder case
ఉత్తరప్రదేశ్ లో ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆతిక్ అహ్మద్నుఅదుపులోకి తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలుకు చేరుకున్నారు. సబర్మతి జైలు అధికారులు మరియు యుపి పోలీసు అధికారుల మధ్య అప్పగించే ప్రక్రియ పూర్తయిన తర్వాత అతడిని ప్రయాగ్‌రాజ్ జైలుకు తీసుకువెళ్లడానికి సిద్దమయ్యారు.
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల హత్యకు గురైన ఉమేష్ పాల్ కేసులో ప్రధాన నిందితుడు అతిక్ అహ్మద్ మరియు అతని కుటుంబ సభ్యులు వార్తల్లో ఉన్నారు.అతిక్‌పై 100 కేసులు ఉండగా, అతని సోదరుడు అష్రఫ్‌పై 52 కేసులు, భార్య షైస్తా ప్రవీణ్‌పై మూడు, కుమారులు అలీ, ఉమర్ అహ్మద్‌లపై వరుసగా నాలుగు, ఒక కేసులు ఉన్నాయి.
ఉమేష్ పాల్ హత్య కేసులో మరో నిందితుడు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి ప్రయాగ్‌రాజ్ పోలీసులతో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కౌంధియార పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు, నిందితులకు మధ్య ఎన్కౌంటర్ జరిగిందని ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనర్ రమిత్ శర్మ సోమవారం తెలిపారు
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పిడిఎ) బుధవారం ప్రసిద్ధ గ్యాంగ్ స్టర్ అటిక్ అహ్మద్ అనుచరుడి ఇంటిని అధికారులు బుల్డోజర్ తో కూల్చేసారు. అతను తన సోదరుడు అష్రఫ్తో కలిసి ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్నాడు