Jr NTR Birthday: జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం – ఫోటోలు వైరల్

Jr NTR Hand Injurie Photos Goes Viral: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు శుభకాంక్షలు వెల్లువెతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన బర్త్‌డే పోస్ట్స్‌తో నిండిపోయాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన నటిస్తోన్న బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ టీజర్ ఫ్యాన్స్ ఊహాలకు అందని రీతిలో ఉంది.
ఎక్స్‌పెక్టేషన్ మించి ఉంది, ఇంతకాలం అప్‌డేట్స్ కోసం ఎదురుచూసిన అభిమానులకు మంచి విజువల్ ట్రీట్ ఇచ్చింది మూవీ టీం. దీంతో వార్ 2పై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇందులో తారక్ పవర్ఫుల్ పాత్రలో కనిపించడంతో ఫ్యాన్స్ అంతా తెగ మురిసిపోతున్నారు. ఇలా ప్రస్తుతం వార్ 2 టీజర్ అభిమానుల సెలబ్రేషన్స్‌ని డబుల్ చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఆయనకు విషెస్ తెలుపుతూ వరుసగా పోస్ట్స్ షేర్ చేస్తున్నారు సినీ ప్రముఖులు. ఈ క్రమంలో బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ తారక్‌కు విషెస్ తెలిపారు.
ఈ మేరకు ఆయనకు రెడ్ శాలువా కప్పుతున్న ఫోటోలు షేర్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ చేతికి కట్టుతో కనిపించాడు. అది ఫ్యాన్స్, నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఆయనకు ఏమైందా అని అభిమానులు కంగారు పడుతున్నారు. మళ్లీ ఆయన చేతికి ఏమైందని ఆరా తీస్తున్నారు. కాగా గతంలో జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా ఆయన ఏడమ చేతి మణికట్టు దగ్గర గాయమైన సంగతి తెలిసిందే. అలాగే అదే చేయికి ఆయన ఇప్పుడు బ్యాండ్ వేసుకుని కనిపించాడు. దీంతో ఇది కొత్త గాయమా? లేక పాత గాయమే మళ్లీ తినగబడిందా? అని అభిప్రాయ పడుతున్నారు.
కాగా ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం తన లుక్‌ని కూడా మార్చేశారు. డైటింగ్ చేసి చాలా సన్నబడి కొత్తలుక్‌లో వచ్చారు. ఇది ప్రశాంత్ నీల్ మూవీ కోసమని తెలుస్తోంది. ఇది పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఈ సినిమా తెరకెక్కతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరీ ఈ సినిమా షూటింగ్‌లో ఆయన చేతికి ఏమైన గాయమైందా అనేది తెలియాల్సి ఉంది.
Happy birthday to man of the masses and power house of talent
Young Tiger @tarak9999 garu #War2Teaser is fantastic& written blockbuster in every frame
Best wishes to future endeavours #HappyBirthdayNTR pic.twitter.com/FeSb2XQ7YC— SKN (Sreenivasa Kumar) (@SKNonline) May 20, 2025