Published On:

Manchu Manoj Birthday: మంచు మనోజ్‌ బర్త్‌డే.. మౌనిక ఎమోషనల్‌ పోస్ట్‌.. నా ప్రతి జన్మలో నువ్వే నా స్నేహితుడు, భర్తగా కావాలి!

Manchu Manoj Birthday: మంచు మనోజ్‌ బర్త్‌డే.. మౌనిక ఎమోషనల్‌ పోస్ట్‌.. నా ప్రతి జన్మలో నువ్వే నా స్నేహితుడు, భర్తగా కావాలి!

Bhuma Mounika Birthday Wishes to Manchu Manoj: మంచు మనోజ్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన భార్య భూమ మౌనిక రెడ్డి ఎమోషలైంది. భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ నోట్ షేర్‌ చేసింది. ఈ మేరకు ఫ్యామిలీ ఫోటో షేర్‌ చేసింది. “హ్యాపీ బర్త్‌డే మై సోల్‌మేట్‌. మా జీవితాల్లోకి వచ్చి.. మీ జీవిత ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మా ప్రపంచాన్ని ముధురంగా మార్చారు. మీరు చేయబోయే అన్ని మంచి పనులు ఎలాంటి అటంకాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నా.

 

మీ ప్రేమ, ఆనందాన్ని పంచడానికి మీ హృదయం వెయ్యేళ్లు బ్రతకాలి. ఈ ఏడాదితో ఇంక మరేన్నో ఏళ్లు మీ జీవితం చాలా గొప్పగా ఉండాలి.  మేము మిమ్మల్ని ఎంతో అమితంగా ప్రేమిస్తున్నాం. మీ జీవితం మరింత ఎదగాలని కోరుకుంటున్నాం. మా ముగ్గురి ప్రేమ మీ కోసం మాత్రమే. మీరు నింజాగా మా రాకింగ్‌ స్టార్‌. హ్యాపీ బర్త్‌డే మై డీయర్‌ హస్పెండ్‌. నా ప్రతి జన్మలో మిమ్మల్నే నా స్నేహితుడిగా, భర్తగా ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా” అంటూ తన పోస్ట్‌లో రాసుకోచ్చారు. ప్రస్తుతం మౌనిక పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

 

కాగా మంచు మనోజ్‌ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెర ఎంట్రీ ఇస్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన భైరవం మూవీ మే 30న విడుదల కాబోతోంది. బెల్లంకోండ సాయి శ్రీనివాస్‌, నారా రోహిత్‌తో, మనోజ్‌లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. యాక్షన్‌, థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ రెండు రోజుల క్రితమే విడుదలైంది. ఈ ట్రైలర్‌కి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. దీంతో భైరవం మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కూతురు అదితి శంకర్‌, ఆనందిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

అయితే గతేడాది  క్రితం మౌనిక, మనోజ్ లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి ప్రేమకు గుర్తుగా ఓ కూతురు జన్మిచ్చింది. కాగా మౌనిక, మనోజ్ లు ఇద్దరికి ఇది రెండో పెళ్లి. గతంలో వీరికి వేరువేరుగా పెళ్లిళ్లు అవ్వగా తమ పార్ట్‌నర్స్‌తో విడాకులు తీసుకుని విడిపోయారు. అనంతరం వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదటి భర్తతో మౌనికకు ఒక కొడుకు పుట్టగా.. మనోజ్‌తో గతేడాది ఆమె కూతురు దేవసేనశోభకు జన్మనిచ్చింది.