Home / Tpcc chIef Revanth Reddy
తెలంగాణలో ఏ గ్రామానికైనా వెళ్దాం..24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సవాల్ చేసారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరెంట్ విషయమై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు.
ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆలంపూర్ లో జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి స్థానంలో కొత్త యాప్ తీసుకొస్తామని చెప్పారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌ది కీలక పాత్రని అన్నారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ బతకదని తెలిసినా తాము రాష్ట్రాన్ని ప్రకటించామని తెలిపారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. పార్టీలో చేరికలపై సమాలోచనలు చేశారు. ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైన వేళ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది.