DC vs GT : గుజరాత్ టార్గెట్ 200, కేఎల్ రాహుల్ అజేయ సెంచరీ

DC vs GT : IPL 2025: టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణిత 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. 65 బంతుల్లో 112* అజేయంగా నిలిచాడు. రెండు టీంలలో ఏ టీం గెలిచినా ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎలాగైనా మ్యాచ్ ను గెలవాలని ఇరు జట్ల ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.
కేఎల్ 65 బంతుల్లో 112 అజేయ సెంచరీ చేశాడు. 60 బాల్స్ లో 100 పరుగులను చేరుకున్నాడు. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన అభిషేక్ 19 బంతుల్లో 30, అక్సర్ పటేల్ 16 బంతుల్లో 25, ట్రిస్టన్ 10బంతుల్లో 21పరుగులు చేశారు. మరో ఎండ్ లో ఓపెనర్ గా దిగిన ప్లెసిస్ 10బంతులకు 5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్ లో రాహుల్ నలువైపులా బంతిని బాదాడు.
ఢిల్లీ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిద్ధ కృష్ణ, సాయి కిషోర్ చెరో వికెట్ తీసుకున్నారు.
సిరాజ్ నాలుగు ఓవర్లకు 37పరుగులు,
రబాడా రెండు ఓవర్లకు 34పరుగులు,
రషీద్ ఖాన్ 4 ఓవర్లకు 32పరుగులు, ఇచ్చారు.
అర్షద్ ఖాన్ రెండు ఓవర్లు వేసి ఒక వికెట్,
క్రిష్ణ నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్,
సాయి కిషోర్ నాలుగు ఓవర్లు వేసి ఒకవికెట్ పడగొట్టారు.
గుజరాత్ : శుభమన్ గిల్ (సి), జోస్ బట్లర్ (W), షెర్పానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
ఢిల్లీ : ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ, KL రాహుల్ (W), అక్షర్ పటేల్(C), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్, ముస్తాఫిజుర్ రెహమాన్