Home / Sukesh Chandrashekhar
ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 500 కోట్లు విరాళంగా ఇవ్వాలని బలవంతం చేసినట్లు సుకేష్ చంద్రశేఖర్ ఆరో్పించారు. జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ గోవా, పంజాబ్ ఎన్నికల కోసం ఆప్‌కి డబ్బు చెల్లించాలని తనను కోరారని ఆరోపిస్తూ ఆయన మరో లేఖ రాసారు.
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కుంభకోణంలో సుకేశ్ చంద్రశేఖర్‌తో పాటు ఇతరులకు సంబంధించిన కేసులో సెప్టెంబరు 26న హాజరు కావాలని జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఈ కేసులో అనుబంధ చార్జిషీట్‌ను కూడా ఏజెన్సీ దాఖలు చేసింది.