Home / NTR Health University
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్‌కు ఏమైంది? కొడాలి నాని ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు? జగన్ సర్కార్ నిర్ణయాల పై కొడాలి నాని అసంతృప్తితో ఉన్నారా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టినా, అన్నగారి వీరాభిమాని ఎందుకు స్పందించడం లేదు.
లక్ష్మీ పార్వతి అలా మాట్లాడటం దారుణం ( ఎన్టీఆర్ కే అవమానం)
ఎన్టీఆర్ పై కామెంట్స్..దాడిశెట్టి పై టీడీపీ మాటల దాడి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన దృష్టిలో హీరో అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. జగన్ ను సోనియా కేంద్రమంత్రిని చేస్తానని చెప్పినప్పటికీ, ఏం అవసరం లేదంటూ ఓదార్పు యాత్రకు వెళ్లిపోయిన వ్యక్తి జగన్ అని తెలిపారు.
మాజీ సీఎం, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మంత్రి దాడిశెట్టి రాజాపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఏపిలో ఆరోగ్య విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తప్పు బట్టారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్, ఆయన పేరు మార్పును ఎవ్వరూ అంగీకరించరు, నేను ఖండిస్తున్నానంటూ కుండ బద్దలు కొట్టిన్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదం పై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్పు పై సీఎం జగన్ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారని, అది ఎన్టీఆర్‌పై ద్వేషంతో చేసిన పని కాదన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి నటనలో ఎస్వీ రంగారావును మించిపోయాడని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా విమర్శించారు. అనిత మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను మీడియా ముందుంచారు.
ఇటీవల కాలంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుతో ఏపీలో రాజకీయ రగడ మొదలయ్యింది. ఈ విషయంపై అటు తెదేపా నేతలు సహా నందమూరి కుటుంబం మరియు అభిమానులు జగన్ ప్రభుత్వం పై ఘాటుగా స్పందిస్తున్నారు. కాగా తాజాగా వర్సిటీ పేరు మార్పు విషయంలో బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి రోజా ట్విట్టర్ ద్వారా స్పందించారు. తేడా వస్తే దబిడి దిబిడే అంటూ ట్వీట్ చేశారు.